నేరేడుచర్ల

తెలంగాణ విముక్తి కోసం తెలంగాణలో నైజాం పాలనకు వ్యతిరేకంగాపోరాడిన కొంజేటి రంగక్కకు ఘనంగా సన్మానం

Submitted by Paramesh on Sat, 17/09/2022 - 12:23

నేరేడు చర్ల సెప్టెంబరు 17 ప్రజా జ్యోతి .  నేరేడు చర్ల మండల పరిధిలోని శనివారం తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవం సందర్భంగా పెంచికల్ దిన గ్రామపంచాయతీ కార్యాలయంలో గ్రామ సర్పంచ్ అధ్వర్యంలో సుంకర వాణి శ్రీరామ్ మూర్తి కొంజేటి సత్యవతి అలియాస్ రంగక్క కు ఘనంగా సన్మానం నిర్వహించారు.ఈ సందర్భంగా సర్పంచ్ వాణి మాట్లాడుతూ తెలంగాణ విముక్తి కోసం తెలంగాణలో నైజాం పాలనకు వ్యతిరేకంగా సాయుధ తెలంగాణ రైతాంగ పోరాటంలో పెంచికల్ దిన్న గ్రామానికి విశిష్టమైన చరిత్ర ఉందని 15 మంది కి పైగా ఆనాటి పోరాటంలో పాల్గొని కొందరు వీరమరణం పొందారాన్నారు.ఆనాటి చరిత్రకు గుర్తుగా రంగకకు సన్మానం చేయడం ఆనందంగా ఉందన్నారు.

పోలీస్ స్టేషన్ నందు తెలంగాణ జాయతీయ సమైక్య త దినోత్సవం సందర్బంగా జెండా ఆవిష్కరణ చేసిన ఎస్ ఐ నవీన్ కుమార్

Submitted by Paramesh on Sat, 17/09/2022 - 12:17


నేరడుచర్ల సెప్టెంబర్ 17(ప్రజా జ్యోతి )/ తెలంగాణ జాతీయ సమైక్యత  దినోత్సవం పురస్కరించుకొని శనివారం నేరేడుచర్ల పోలిస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ నవీన్ కుమార్  జాతీయ పతాక ఆవిష్కరణ చేయడం జరిగింది.ఈ కార్యక్రమం లో పోలీస్ స్టేషన్  ఏ ఎస్ ఐ మరియూ సిబ్బంది పాల్గొన్నారు.

రాష్ట్ర ప్రభుత్వంపై భవిష్యత్తు పోరాటాల డిమాండ్స్ కరపత్రం విడుదలచేసిన. బిజెపి

Submitted by Paramesh on Thu, 15/09/2022 - 17:10

నేరేడు చర్ల సెప్టెంబరు 15 ప్రజా జ్యోతి ..నేరేడుచర్లబిజేపీ పార్టీ కార్యాలయంలో ఇ నెల 24-09-2022 న భారతీయ జనతా పార్టీ  గిరిజన మోర్చా కార్యవర్గ మహాసభ నిర్వహిస్తున్నట్లు  గురువారం నేరేడుచర్ల పట్టణ మరియు మండల అధ్యక్షులు సంకలమద్ది సత్యనారాయణ రెడ్డి పార్తనబోయిన విజయ్ కుమార్ యాదవ్ కరపత్రం విడుదల చేశారు.అనంతరం వారు మాట్లాడుతూ  రాష్ట్ర ప్రభుత్వంపై భవిష్యత్తులొ చేయాల్సిన పోరాటాల  డిమాండ్స్ కు సంబంధించి  గిరిజనులు సాగు చేస్తున్న అటవీ పోడు భూములకు 2006 అటవీ హక్కుల చట్టం ద్వారా పోడు భూములకు వెంటనే పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ అదే విధంగా అనేక రకాలుగా ఉన్న ఎస్టీ రిజర్వేషన్ల ను అమలు చేయాల

జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న.మున్సిపల్ వైస్ చైర్మన్ చల్లా శ్రీలత రెడ్డి

Submitted by Paramesh on Thu, 15/09/2022 - 17:03

నేరేడు చర్ల  సెప్టెంబరు 15 ప్రజా జ్యోతి .. నేరేడుచర్ల మున్సిపాలిటీ పరిధిలో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో విద్యార్థులకు నులిపురుగుల నివారణ కొరకు ఆల్బెండజోల్ మాత్రలు వేసే కార్యక్రమాన్ని మున్సిపల్ వైస్ చైర్మన్  చల్లా శ్రీలత రెడ్డి ప్రారంభించారు.

పోలీస్ పరీక్షల్లో యస్సి యస్టీ బీసీ లకు తీవ్ర అన్యాయం

Submitted by Paramesh on Mon, 12/09/2022 - 10:53

నేరేడు చర్ల సెప్టెంబరు 12 ప్రజా జ్యోతి  ; తెలంగాణా రాష్ట్ర సర్కార్ ఇటీవలీ కాలంలో నిర్వహించిన ఎస్సై , కానిస్టేబుల్ పరీక్షల్లో యస్సి, యస్టీ,బీసీలకు  రిజర్వేషన్ లేకుండ అన్యాయం చేసిందని సోమవారం నేరేడుచర్ల మండల  కాంగ్రెస్ పార్టీ మండల  యస్సి.సెల్.అధ్యక్షులు వుాట్కుారి సైదులు అన్నారు.గతం లో ఓసీ అభ్యర్ధులకు 80 మార్కులు బీసీ అభ్యర్ధులకు 70 మార్కులు మరియు యస్సీ , యస్టీ లకు 60 మార్కులు కటాఫ్ ఉంటే ఇప్పుడు ఓసీలకు కటాఫ్ మార్కులను 60 కి తగ్గించింది కానీ యస్సీ , యస్టీ , బీసీలకు ఎలాంటి మార్కులు తగ్గించకుండా తెలంగాణా రాష్ట్ర సర్కార్ రిజర్వేషన్ లో అన్యాయం చేస్తుందని ఆయన ప్రభుత్వ తీరు ను విమర్

నీట్ లో మెరిసినసాయి స్వరూప్ గౌడ్

Submitted by Paramesh on Sat, 10/09/2022 - 14:09

నేరేడుచర్ల సెప్టెంబరు 9 ప్రజా జ్యోతి  .నేరేడుచర్ల మండల పరిధిలోని కల్లూరు గ్రామానికి చెందిన బుడిగే నాగరాజ్ గౌడ్ కుమారుడు బుడిగే సాయి స్వరూప్ గౌడ్ నీట్ లో మెరిసాడు.నీట్ ఫలితాలలో720 మార్కుల కుగాను 575 మార్కులు సాధించి తన సత్తా చాటాడు. గత విజేతల సలహాలు అధ్యాపకుల సూచనలతో పరీక్షలకు సిద్ధమైనట్టు తెలిపారు. కష్టపడి చదివి కార్డియాలజీ డాక్టర్ కావటం తన లక్ష్యం గా పెట్టుకున్నానని పేదవారికి ఉచిత వైద్యం అందిస్తాను అన్నారు

జాతీయ పంచాయతీ అవార్డ్స్ పై మండల స్థాయి అధికారులకు మరియు పంచాయతీ కార్యదర్శులకు ట్రైనింగ్ ప్రోగ్రామ్ నిర్వహించిన.ఎంపిడిఓ శంకరయ్య

Submitted by Paramesh on Sat, 10/09/2022 - 12:04

నేరేడు చర్ల సెప్టెంబరు 9 (ప్రజా జ్యోతి)  నేరేడుచర్ల మండల కార్యాలయంలో శుక్రవారము నాడు జాతీయ పంచాయతీ అవార్డ్స్ పై మండల స్థాయి అధికారులకు మరియు పంచాయతీ కార్యదర్శులకు ట్రైనింగ్ ప్రోగ్రామ్ నిర్వహించిన ఎంపిడిఓ శంకరయ్య. ఈ కార్యక్రమంలో మండల పంచాయతీ అధికారి ఇ. విజయకుమారి, మండల తహసీల్దార్ సరిత, పంచాయతీరాజ్ ఏ ఐ  యల్.మధు మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు