టీ యు రిజిస్ట్రార్ గా కనకయ్య

Submitted by s.raju on Fri, 26/05/2023 - 11:33
ఫోటో

 టి యు రిజిస్ట్రార్ గా కనకయ్య

వీసీ ఇచ్చిన నియామకం

ఈసీ యాదగిరికే మద్దతు

మళ్లీ కొత్త పంచాయతీ

నిజామాబాద్ రూరల్ ఆర్సి, ప్రజాజ్యోతి, మే 26 :

తెలంగాణ యూనివర్సిటీ రిజిస్ట్రార్ గా కనకయ్య ను వీసీ రవీందర్ గుప్తా నియమించారు. ఈ మేరకు కనకయ్య శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. అయితే గురువారం జరిగిన ఈసీ సమావేశంలో రిజిస్ట్రార్ గా యాదగిరినే కొనసాగించాలని నిర్ణయించారు. ఈసీ నిర్ణయాన్ని రాష్ర్ట ఉన్నత విద్య శాఖ కార్యదర్శి వాకాటి కరుణ ద్వారా ప్రభుత్వానికి పంపారు. ఒకటి రెండు రోజుల్లో రిజిస్ట్రార్ విషయంలో ప్రభుత్వం నుంచి ఆదేశాలు రానున్నాయి. ఈ తరుణంలో వీసీ రవీందర్ గుప్తా రిజిస్ట్రార్ గా కనకయ్యను నియమిస్తూ శుక్రవారం ఉత్తర్వులు ఇచ్చారు. రిజిస్ట్రార్ గా కనకయ్య బాధ్యతలు స్వీకరించారు. గతంలో 2021 నవంబర్ లో కనకయ్య రెండు నెలలుగా రిజిస్ట్రార్ గా పని చేశారు. కానీ ఈసీ సమావేశంలో ఒకటి రెండు ఆరోపణలతో రిజిస్ట్రార్ గా యాదగిరిని నియమించారు. యాదగిరి నెల రోజుల వ్యవధిలోనే తప్పుకున్నారు. ఆ తరువాత వీసీ ఉత్తర్వుల మేరకు శివశంకర్ రిజిస్ట్రార్ గా కొనసాగారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏప్రిల్ 19,2023 ఈసీ సమావేశం జరగలేదు. ఈసీ రిజిస్ట్రార్ గా యాదగిరి ని నియమించిన సంగతి తెలిసిందే. కానీ వీసీ రవీందర్ గుప్తా యాదగిరిని కాదని మళ్ళి కనకయ్య కు రిజిస్ట్రార్ గా బాధ్యతలు అప్పగించడం విశేషం.