విద్యార్థులు చదువుతో పాటు క్రీడలలో రాణించాలి..

Submitted by shaikmohammadrafi on Mon, 26/09/2022 - 13:14
Students should excel in sports along with studies.

క్రీడలు మానసిక ఉల్లాసాన్ని పెంపొందిస్థాయి.

 ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్..

నడిగూడెం, సెప్టెంబర్ 25 ,ప్రజా జ్యోతి:  విద్యార్థులు చదువుతో పాటు క్రీడలలో  రాణించాలి అని కోదాడ అభివృద్ధి ప్రదాత, శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్  అన్నారు.  ఆదివారం  నడిగూడెం సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో పండుగ వాతావరణం లో జరిగిన8 వ జోనల్ స్థాయి  స్పోర్ట్స్ మీట్ కార్యక్రమాన్ని అయన ప్రారంభించారు.ఈ సందర్భంగా  ఎమ్మెల్యే  మల్లయ్య యాదవ్  మాట్లాడుతూ క్రీడలు మానసిక ఉల్లాసాన్ని పెంపొందిస్థాయని అన్నారు.రెపటి తరానికి క్రీడలు ఎంతో దోహదపడుతాయి  అన్నారు.విద్యార్థులు చదువుతో పాటు క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలన్నారు. క్రీడాకారులకు, కళాకారులకు తన వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని చెప్పారు.  పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రభుత్వం గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అత్యధిక గురుకులాలు ఏర్పాటు చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ గారిదేనన్నారు.గురుకుల పాఠశాలలో ప్రతి విద్యార్థికి రూ.1.20లక్షలు  ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. అనంతరం క్రీడలు ప్రారంభించి ఎమ్మెల్యే విద్యార్థులతో కలిసి    కబడ్డీ ఆడారు.విద్యార్థులు చేసిన  ఫ్లాగ్ మార్చ్  సబికులను ఎంతో ఆకట్టుకున్నాయి. నడిగూడెం పాఠశాల నుండి కబడ్డీ క్రీడలో పాల్గొనే క్రీడాకారులకు స్థానిక ఎస్సైఎం ఏడుకొండలుటీ షర్టులను అందజేశారు.  ప్రారంభ కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ను ఈ  సందర్బంగా  గురుకుల పాఠశాల రీజినల్ కోఆర్డినేటర్ అరుణ కుమారి, ప్రిన్సిపాల్ ధన విజయలక్ష్మి,, పాఠశాల  సిబ్బంది  శాలువా, మెమోంటోతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ యాతాకుల జ్యోతి మధుబాబు,జెడ్పిటిసి  బాబాల కవిత నాగరాజు, సర్పంచ్ గడ్డం నాగలక్ష్మి మల్లేష్ యాదవ్, ఎంపీటీసీ  గుండు శ్రీను, ఆర్డీవో కిషోర్ కుమార్, డీఎస్పీ వెంకటేశ్వర రెడ్డి, కళాశాల ప్రిన్సిపల్,  అధ్యాపక బృందం, వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు,పి ఈ టి లు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు....