గ్రామాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి

Submitted by veerareddy on Thu, 29/09/2022 - 14:13
State Government's efforts for the development of villages


పిఎసిఎస్ డైరెక్టర్ దేశం పుల్లారెడ్డి

అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు ప్రారంభం

కల్వకుర్తి,సెప్టెంబర్ 29(ప్రజాజ్యోతి):  గ్రామాల అభివృద్ధికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని పిఎసిఎస్ డైరెక్టర్ దేశం పుల్లారెడ్డి అన్నారు గురువారం కల్వకుర్తి మండలం మార్చాల గ్రామంలో మండల పరిషత్ నిధుల నుండి ఎంపిటిసి సహకారంతో 5 లక్షల 50 వేలతో చేపట్టిన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులను రెండో వార్డులో350 మీటర్ల పొడవు గల అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ని పిఎసిఎస్ డైరెక్టర్ దేశం పుల్లారెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామ అభివృద్ధికి ఎంపీ ,ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, సహకారంతో గ్రామ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తామని ఆయన అన్నారు గ్రామాల రూపురేఖలు మారుస్తూ ప్రజలకు అన్ని సౌకర్యాలు కల్పించిన మన ముఖ్యమంత్రి కేసీఆర్ అని ఆయన పేర్కొన్నారు దేశంలో ఎక్కడా లేని సంక్షేమ పథకాలు మన తెలంగాణలో ఉన్నాయని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సునీత వెంకట్ రెడ్డి, ఉప సర్పంచ్ రంగయ్య, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ బాలయ్య, మాజీ జెడ్పిటిసి హరిదాస్, టిఆర్ఎస్ మండల నాయకులు చెన్నకేశవులు, మాజీ ఉపసర్పంచ్ మదన్ మోహన్ రావు, మాజీ వార్డు సభ్యులు అశోక్ బాబు, హై స్కూల్ చైర్మన్ వెంకటయ్య, వార్డు సభ్యులు డొక్కా లింగం, కంకల శ్రీశైలం, టిఆర్ఎస్ నాయకులు మల్లేష్ యాదవ్, కిషోర్, రాములు, గెలవయ్య, గ్రామస్తులు ఉన్నారు