నాంపల్లిలో టిఆర్ఎస్ కుటుంబ సభ్యుల ఆత్మీయ సమ్మేళనం వనభోజన కార్యక్రమం

Submitted by Sathish Kammampati on Tue, 27/09/2022 - 15:10
 A spiritual gathering of TRS family members at Nampally

నాంపల్లి సెప్టెంబర్ 26 (ప్రజాజ్యోతి ):  ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలోని తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందిందనిప్రపంచ దేశాలలో ఎక్కడలేని విధంగా సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిన ఘనత  తెలంగాణ  సీఎం కేసీఆర్ దేనని  విద్యుత్ శాఖ మంత్రి గుంతకండ్ల జగదీశ్వర్ రెడ్డి అన్నారు. సోమవారం నాంపల్లి మండల కేంద్రంలో టిఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యుల ఆత్మీయ సమ్మేళన, వనభోజన  కార్యక్రమానికి వివిధ గ్రామాల నుండి టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కోలాటం,బోనాలు , బతుకమ్మలు , సాంస్కృతిక విన్యాసాలతో రెండు కిలోమీటర్లు ర్యాలీ తీశారు. మండలంలో ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా  మంత్రి జగదీశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకొని వారు  మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చెందిందని పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పడక ముందు 60 సంవత్సరాలుగా పాలించిన ఆంధ్ర పాలకులు తెలంగాణ ప్రాంతానికి ఎలాంటి అభివృద్ధి చేయలేదని అన్నారు. అదేవిధంగా నల్గొండ జిల్లాలో మునుగోడు ప్రాంత ప్రజలు ఫ్లోరోసిస్ తో బాధపడుతున్న ప్రాంతానికి సీఎం కేసీఆర్ కృష్ణా జలాలను తాగునీరు అందించి ఫ్లోరిన్ తరిమి కొట్టారని అన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో నైనా 500, 600 ఆసరా పింఛన్లు ఇస్తున్న, తెలంగాణ ప్రభుత్వం 2016లో 3016 లు ఇస్తున్నారాని అన్నారు.రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాల ద్వారా రైతుబంధు, రైతు బీమా, 24 గంటల కరెంటు, కళ్యాణ్ లక్ష్మి, దళిత బందు లాంటి సంక్షేమ పథకాలు కెసిఆర్ ప్రభుత్వంతోటే సాధ్యం అని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఎనిమిది సంవత్సరాల పాలనలో  గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలను పెంచడమే తప్ప అభివృద్ధి చేసింది ఏం లేదని విమర్శ విమర్శించారు.

మునుగోడు ప్రాంతం అభివృద్ధి కావాలంటే టిఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించాలని అన్నారు.ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, దేవరకొండ ఎమ్మెల్యే రామావత్ రవీంద్ర కుమార్, ఎమ్మెల్సీ ఎం సి కోటిరెడ్డి, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్, మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, మాల్ మార్కెట్ కమిటీ చైర్మన్ దంటు జగదీశ్వర్, ఎంపీపీ ఏడు దొడ్ల శ్వేతా రవీందర్ రెడ్డి, జడ్పిటిసి వెలుగోటి వెంకటేశ్వర్ రెడ్డి, వైస్ ఎంపీపీ పానగంటి రజినీ వెంకన్న గౌడ్, రైతుబంధు మండల కన్వీనర్ ఏడుదొడ్ల రవీందర్ రెడ్డి, టిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు గుమ్మడపు నరసింహారావు,సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు మునగాల సుధాకర్ రెడ్డి, సర్పంచులు, ఎంపిటిసిలు  తదితరులు పాల్గొన్నారు.