భగత్ సింగ్ స్ఫూర్తితో విద్య కాషాయకరణ, మతోన్మాదానికి వ్యతిరేకంగా ఉద్యమిస్తాం

Submitted by shaikmohammadrafi on Tue, 27/09/2022 - 16:23
In the spirit of Bhagat Singh, we will move against corruption of education and fanaticism

జిల్లా సహాయ కార్యదర్శి కేసగాని భద్రయ్య..

నడిగూడెం, సెప్టెంబర్ 27, ప్రజా జ్యోతి:  నడిగూడెం మండలం కరివిరాల లో డివైఎఫ్ఐ గ్రామ కమిటీ ఆధ్వర్యంలో భగత్ సింగ్ 115వ జయంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించడం జరిగింది.ఈ సందర్భంగా జిల్లా సహాయ కార్యదర్శి కేశగాని భద్రయ్య మాట్లాడుతూ భగత్ సింగ్ స్ఫూర్తితో విద్యలోకాశాయికరణ, మతోన్మాదానికి వ్యతిరేకంగా ఉద్యమిస్తామని అన్నారు.  ప్రగతిశీల అభ్యుదయ భావాలకు వ్యతిరేకమైనటువంటి పరిపాల నిర్వహిస్తున్న బిజెపి  పాఠ్యాంశాల్లో మతోన్మాదాన్ని మూఢత్వాన్ని పెంచే విధంగా విద్యా విధానాన్ని అవలంబిస్తుందని బిజెపి అధికారంలో ఉన్న కర్ణాటక రాష్ట్రంలో దేశ స్వాతంత్రం కోసం తన ప్రాణాలను లెక్కచేయకుండా ఉరికంభం ముద్దాడిన భగత్ సింగ్ జీవిత విశేషాలను కర్ణాటక ప్రభుత్వం పాఠ్యంశం నుంచి తొలగించి మూఢవిశ్వాసాలు పెంచే విధంగా స్వాతంత్ర పోరాటంలో ఏ రోజు పాలుపంచుకొని సావర్కర్ అండమాన్ జైలు నుంచి బుల్బుల్ పక్షి రెక్కల పై వచ్చి పోరాటం చేసి మళ్లీ జైలుకు వెళ్ళినట్టుగా పాఠ్యపుస్తకాలలో ఉంచారు, ఇది బిజెపి నీతిమాలిన విద్యా విధానానికి మూఢత్వానికి నిదర్శనమని కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న విద్యా విధానాలకు వ్యతిరేకంగా సామ్రాజ్యవాద మతోన్మాదానికి వ్యతిరేకంగా పోరాటంకై యువత సిద్ధం కావాలని అన్నారు. దేశంలో నూతన విద్యా విధానం పేరుతో విద్యార్థులలో విద్యలో కులాన్ని మతాన్ని చొప్పించి ప్రయత్నం చేస్తుంది అన్నారు భవిష్యత్తులో నూతన విద్యా విధానం రద్దు చేసేంతవరకు పోరాటం చేస్తామని అన్నారు.ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ కార్యకర్తలు షేక్ మహమ్మద్ , సతీష్ రెడ్డి,తరుణ్ ,నాగయ్య, కళ్యాణ్ ,ప్రవీణ్ ,వంశీ ,రూపస్ ,తదిరులు పాల్గొన్నారు.