దుర్గ అమ్మవారి ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు

Submitted by Sathish Kammampati on Fri, 30/09/2022 - 11:14
Special events at Goddess Durga temple
  • 108 రకాల ప్రసాదాలతో అమ్మవారికి నివేదన
  • భక్తులకు పెద్ద ఎత్తున అన్నదానం
  •  ముఖ్య అతిథిగా పాల్గొన్న మున్సిపల్ చైర్మన్ కోమటిరెడ్డి చిన్న వెంకటరెడ్డి 

చిట్యాల సెప్టెంబర్ 29(ప్రజాజ్యోతి).//... నల్లగొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గం చిట్యాల పట్టణం లోని కనకదుర్గా అమ్మ వారి దేవాలయంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా గురువారం ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు.అమ్మవారికి 108 రకాల ప్రసాదాలను నైవేద్యముగా సమర్పించారు.మహిళలు కుంకుమార్చన నిర్వహించారు.అమ్మవారు అన్నపూర్ణా దేవి గా భక్తులకు దర్శనమిచ్చారు.భక్తులకు పెద్ద ఎత్తున ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంను మున్సిపల్ చైర్మన్ కోమటిరెడ్డి చిన్న వెంకట్ రెడ్డి ప్రారంభించారు.చిట్యాల కు చెందిన పోల పెద్దయ్య ధనలక్ష్మి దంపతుల సహకారంతో అన్నదాన కార్యక్రమం జరిగింది.ఆలయ అధికారి అంబటి నాగిరెడ్డి భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించారు.అర్చకులు వాసుదేవశర్మ ఆచార్యత్వంలో పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి.ఉత్సవాలను విజయవంతంగా జరుగుచున్నాయని ఉత్సవ కమిటీ చైర్మన్ శీలా సత్యనారాయణ సభ్యులు గంజి వెంకటేశం, బుద్ధ విమల కృష్ణమూర్తి, పోకల అచ్చాలు, సాయిరెడ్డి ప్రతాప్ రెడ్డి, జిట్టా శేఖర్, వరకాంతం నర్సిరెడ్డిలు తెలిపారు. 

అమ్మ వారికి 50వేల విరాళం

కనకదుర్గా అమ్మవారి ఆలయం అభివృద్ధికి చిట్యాల కు చెందిన కొరివి వెంకన్న ఆర్థిక సహకారం అందిస్తానని ఉత్సవ కమిటీకి హామీ ఇచ్చారు.త్వరలో ఆలయ అభివృద్ధి విస్తరణ పనులకు తన ప్రకటించిన విరాళం ను అందజేస్తానని అన్నారు.ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ జడల ఆది మల్లయ్య యాదవ్, వనమా వెంకటేశ్వర్లు, పొన్నం లక్ష్మయ్య గౌడ్, వేలుపల్లి వెంకటేశ్వర్లు, జిట్ట చంద్రకాంత్ తో పాటు కౌన్సిలర్లు, మహిళలు, భక్తులు పాల్గొన్నారు.