భారత రాజ్యాంగ నిర్మాతకు అవమానం.. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహంపై వివక్ష ఎందుకు..! సిఐటియు జిల్లా అధ్యక్షుడు కే శ్రీనివాస్...

Submitted by kosgi narsimulu on Mon, 26/09/2022 - 12:48
Shame on the creator of the Constitution of India.. Why discrimination on the statue of Dr. BR Ambedkar..! CITU district president K Srinivas...

తాండూరు సెప్టెంబర్ 25 ప్రజా జ్యోతి:-  భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహంపై వివక్ష ఎందుకు..!  అంటూ వికారాబాద్ జిల్లా   
సిఐటియు జిల్లా అధ్యక్షుడు  కే శ్రీనివాస్ ఆవేదన వ్యక్తపరిచారు. గ్రామ నడి బొడ్డున ఉండాల్సిన రాజ్యాంగ నేత విగ్రహాన్ని  పిచ్చి మొక్కల మద్యన అవమానించే విధంగా  నిర్లక్ష్యం చేస్తున్న పంచాయతీ కార్యదర్శి గ్రామ సర్పంచ్ లపై తగిన చర్యలు తీసుకోవాలంటూ సిఐటియు వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ ప్రభుత్వాన్ని  చేశారు. వివరాల్లోకి వెళితే వికారాబాద్ జిల్లా పెద్దేముల్‌ మండలం ఆత్కూరు గ్రామంలో కనిపిస్తున్న  ఈవిచారకరమైన ఘటన  కనిపించడం బాదకరమని పేర్కొన్నారు. గ్రామ  సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని  డిమాండ్ చేశారు. అవగాహన లోపమా లేక కావాలనే  భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహంపై వివక్ష చూపెడుతూ గ్రామంలో ప్రతిష్టించక పోవడంతో  పలు అనుమానాలకు దారి తీస్తుందనే చెప్పాలి.. అక్కడ  పెంట కుప్పల పై రాజ్యాంగ నేత విగ్రహాన్ని  అవమానకరంగా పెట్టిన గ్రామ సర్పంచ్ సెక్రెటరీ పై చట్టపరమైన చర్య తీసుకొని ఊరు మధ్యలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం  పెట్టాలని  కోరారు.  భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం   ద్వారానే సర్పంచుగా పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తూ భారత రాజ్యాంగ నిర్మాత విగ్రహాన్ని ఊరి మధ్యలో పెట్టకుండా అడ్డుపడుతున్న వ్యక్తుల పై జిల్లా  అధికారులు కలెక్టర్, ఎస్పీచర్య  తీసుకోవాలని  డిమాండ్ చేశారు.