సెప్టెంబర్ 13 విఆర్ఏ చలో అసెంబ్లీ

Submitted by Satyanarayana on Sun, 11/09/2022 - 18:16
September 13 VRA Chalo Assembly

విఆర్ఏ కుటుంబానికి ఖమ్మం వీఆర్ఏ జేఏసీ  పరామర్శ

ఖమ్మం, సెప్టెంబరు 11 ప్రజాజ్యోతి .  రాష్ట్ర విఆర్ఏ జేఏసీ పిలుపు మేరకు సెప్టెంబర్ 13 ఛలో అసెంబ్లీ కి రాష్ట్ర నలుమూలల నుండి భారీగా విఆర్ఏ లు తరలి రావాలని జేఏసీ చైర్మన్ చల్లా లింగరాజు  కోరారు. సీఎం కేసీఆర్ విఆర్ఏ లకు ప్రకటించిన పేస్కేల్, పదోన్నతలు, వారసత్వ ఉద్యోగాలు ఇస్తానన్న హామీలు అమలు కాకపోవడంతో మనస్థాపంతో మిర్యాలగూడ డివిజన్ ఊట్లపల్లి గ్రామ రెవెన్యూ సహాయకులు కంచర్ల వెంకటేశ్వర్లు మృతి చెందారని వారి కుటుంబాన్ని ఖమ్మం జిల్లా వీఆర్ఏలు మిర్యాలగూడెం వెళ్లి ఆదివారం పరామర్శించారు. వారి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటు, వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఆత్మహత్యకు కెసిఆర్ ప్రభుత్వం భాద్యత వహించి వారి కుటుంబంనకు ఎక్స్  గ్రెసియా చెల్లించాలని, వారి కుటుంబం లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగము ఇవ్వాలని డిమాండ్ చేసారు.

ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి బంగారు తెలంగాణ బిడ్డల ప్రాణాలు పోకుండా వెంటనే వీఆర్ఏ లకు చట్టసభల సాక్షిగా ఇచ్చిన హామీలు అమలు చేయాలన్నారు. ఖమ్మం జిల్లా వీఆర్ఏ జేఏసీ నుండి ఆర్థిక సహాయం అందజేశారు. పరామర్శించిన వారిలో జిల్లా చైర్మన్ లింగరాజు , జిల్లా ట్రీజరీ ఉపేందర్, రూరల్ మండల అధ్యక్షులు చందుమియా, వీరయ్య, అజయ్, మురళి, ఇబ్రహీం, నాగరాజు, ముత్తయ్య, రామారావు, గోపి, నరేష్, వెంకట్, కృష్ణ, సంపత్, జ్యోతి బాసు తదితరులు పాల్గొన్నారు.