సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. జడ్పీ చైర్మన్

Submitted by lenin guduru on Thu, 20/10/2022 - 19:07
చైర్మన్

సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.

జడ్పీ చైర్మన్

చిల్పూర్, అక్టోబర్ 20, (ప్రజాజ్యోతి)

సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని,మన ఇంటి తోపాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని జనగాం జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, జడ్పీ చైర్మన్ పాగాల సంపత్ రెడ్డి అన్నారు.ఈ సందర్భంగా గురువారం చిల్పూరు మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో జాతీయ బోదకాలు నివారణ  కార్యక్రమం పై జనగామ వారి ఆధ్వర్యంలో బోదకాలు వ్యాధి నివారణ కొరకు జిల్లాలోని ప్రజలందరిచేత సామూహిక డిఐసి, ఆల్బౌండజోల్ మాత్రలు మింగించు కార్యక్రమానికి జడ్పీ చైర్మన్ పాగాల సంపత్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.ఇందులో భాగంగా జడ్పీ చైర్మన్ సంపత్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వైద్యానికి అధిక ప్రాధాన్యత  ఇస్తోందని అన్నారు.ప్రజలు ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకొని అనారోగ్య బారిన పడకుండా ఉండాలన్నారు. అంతేకాకుండా సిజినల్ వ్యాధులతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, బోదకాలు వ్యాధి నివారణకు ప్రజలు అందరూ తప్పకుండా మాత్రలు వేసుకోవడం మంచిదని సూచించారు.ఈ కార్యక్రమంలో ఎంపిపి సరిత బాలరాజు, రంగు రవి, వైద్యాధికారి డాక్టర్ ఆది లక్ష్మీనారాయణ, పాఠశాల ప్రధానోపాధ్యాయులు,  ఉపాధ్యాయులు, ఆశ వర్కర్లు, విద్యార్థులు,గ్రామ ప్రజలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.