వామపక్ష పార్టీలకు రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలి:సిపిఐ డిమాండ్

Submitted by Paramesh on Mon, 26/09/2022 - 13:01
Revanth Reddy should apologize to Left parties: CPI demand

నేరేడుచర్ల, సెప్టెంబర్25,(ప్రజాజ్యోతి):  వామపక్ష పార్టీల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలని ఆదివారం సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం సూర్యాపేట జిల్లా ప్రధాన కార్యదర్శిధూళిపాళ ధనుంజయ నాయుడు డిమాండ్ చేశారు.కమ్యూనిస్టులు డబ్బులకు అమ్ముడుపోయారని వ్యాఖ్యానించడం రేవంత్ రెడ్డి అహంకారపూరితమైన వ్యాఖ్యలకు మొత్తం కాంగ్రెస్ పార్టీ బాధ్యత వహించాలని, డబ్బులకు అమ్ముడుపోయే చరిత్ర రేవంత్ రెడ్డి దేనని ఓటుకు నోటు కేసులో జైల్లో చిప్పకూడు తిన్నది ఎవరో ఒకసారి వెనక్కి తిరిగి చూసుకోవాలని, దుబ్బాక హుజురాబాద్ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి కేవలం రెండు నుంచి మూడు వేల ఓట్లు మాత్రమే వచ్చి డిపాజిట్ గల్లంతయిందని అప్పుడు డబ్బులకు అమ్ముడుపోయింది ఎవరో సమాధానం చెప్పాలని నోటికి ఏ మాట వస్తే ఆ మాటను పిచ్చికూతలు కూస్తే వామపక్ష కార్యకర్తలు ఊరుకోరని  మరోసారి ఇలాంటి ప్రేలాపనలు పేలకుండా వారి పార్టీ జోక్యం చేసు కొని తగు జాగ్రత్తలు తగు బుద్ధులు నేర్పాలని ఆయన హితవుపలికారు

.దేశంలోపెట్రేగిపోతున్నమతోన్మాదాన్ని అడ్డుకట్ట వేయగలిగే దమ్ముధైర్యంకమ్యూనిస్టులకు మాత్రమే ఉన్నదని, మతోన్మాద శక్తులను ఓడించాలంటే లౌకిక పార్టీ అయిన టిఆర్ఎస్ పార్టీకి ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే మద్దతు ఇచ్చామని, మునుగోడు కాంగ్రెస్ లో మూడు ముక్కలాట కొనసాగుతుంది అని పార్టీ నాయకత్వం ఐక్యంగా లేకపోవడం వల్ల కాంగ్రెస్ మునుగోడులో బలహీనపడి పోయిందని స్పష్టంగా అర్థం అవుతుండడంవల్లనే టిఆర్ఎస్ కు వామపక్షాలు మద్దతు ఇచ్చాయని జాతీయ స్థాయిలో కూడా కాంగ్రెస్ పార్టీ రోజురోజుకు కుంచించుకు పోతుందని అర్థమవుతుందని. ప్రత్యేక పరిస్థితుల్లో టిఆర్ఎస్ లో కలిసి ప్రయాణం కొనసాగిస్తున్నామని ఆయన తెలిపారు.ఆయన వెంట మండల సిపిఐ కార్యదర్శి ఎల్లబోయిన సింహాద్రిపట్టణ సిపిఐ కార్యదర్శి కత్తి శ్రీనివాసరెడ్డి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు రావుల సత్యం, ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షుడు చిలక రాజు శ్రీను, ఏఐటీయూసీ మండలాధ్యక్షుడు ఊదర వెంకన్న, సిపిఐ నాయకులు అంబటి బిక్షం, కటికోలవెంకన్న కొండ అంజయ్య, పొంతటి కేశవరెడ్డి, కత్తి వెంకటరెడ్డి, గైగుళ్ల శ్రీరాములు, గోరుగంతం శ్రీను, అయిల నాగేశ్వరరావు తదితరులు ఉన్నారు