టీఆర్‌ఎస్‌ పాలనలో మహిళలకు గౌరవం

Submitted by venkat reddy on Sun, 25/09/2022 - 11:49
Respect for women under TRS rule

నాగార్జున సాగర్ శాసనసభ్యులు నోముల భగత్ 
-బతుకమ్మ కానుక చరిత్రాత్మకం
-ప్రకృతి ని ఆరాధించే పండుగ బతుకమ్మః
-గంగా జమున తహజీబ్ కు బతుకమ్మ పండుగ ప్రతిబింభం
-ప్రజలను ప్రేమించే కేసీఆర్ వల్లే  ఇలాంటి పథకాలు సాధ్యం

నిడమనూరు,సెప్టెంబర్ 24(ప్రజాజ్యోతి):టీఆర్‌ఎస్‌ పాలనలో మహిళలకు గౌరవం దక్కిందనినాగార్జునసాగర్ శాసనసభ్యులు నోముల భగత్  అన్నారు. శనివారం నిడమానూరు మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో తెలంగాణ ఆడ బిడ్డల కు దసరా కానుక బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. అనంతరం పాత అసరా ఫించన్ల లబ్ధిదారులకు పెన్షన్ కార్డులను ఉమ్మడినల్లగొండ జిల్లా ఎమ్మెల్సీ కోటి రెడ్డి ,నాగార్జున సాగర్ శాసనసభ్యులు నోముల భగత్ లు అందజేశారు.ఈసందర్భంగా వారు మాట్లాడుతూ శాంతి సామరస్యానికి , పరమత సహనానికి మహిళలు అందరూ కలిసి జరుపుకునే బతుకమ్మ పండుగ  ద్వారా తెలంగాణ గొప్పతనాన్ని ప్రపంచానికి చాటే విధంగా ఉండాలనే ఉద్దేశ్యతోనే ముఖ్యమంత్రి కేసీఆర్  ఆడపడుచులకు  చీరల పంపిణీ పథకానికి శ్రీకారం చుట్టారని ఉమ్మడినల్లగొండ జిల్లా ఎమ్మెల్సీ కోటి రెడ్డి ,ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్ లు అన్నారు. అదేవిధంగా మన సంస్కృతి , ప్రకృతిని ఆరాధించే  బతుకమ్మ  పండుగ  తెలంగాణ జాతికి మాత్రమే సొంతం అని వారు అన్నారు.  ప్రభుత్వం ఏటా అందజేస్తున్న బతుకమ్మ  కానుక చరిత్రాత్మకమని పేర్కొన్నారు. నిడమానూరు మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆడపడుచులకు ఇస్తున్న దసరా కానుక చీరల పంపిణీ కార్యక్రమాన్ని ఉమ్మడినల్లగొండ జిల్లా ఎమ్మెల్సీ కోటి రెడ్డి ,ఎమ్మెల్యే భగత్ లు  ప్రారంభించారు.టీఆర్‌ఎస్‌ పాలనలోనే మహిళలకు సముచిత గౌరవం దక్కిందని అన్నారు. వారి అభ్యున్నతికి దేశంలో ఎక్కడా లేనివిధంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నదని పేర్కొన్నారు.కేసీఆర్ ప్రభుత్వం అన్ని మతాల పండుగలకు సమ ప్రాధాన్యమిస్తున్నదని చెప్పారు.2014 కు ముందు  గతంలో పాలించిన పాలకులు ఏ మత సంప్రదాయాలను, సంస్కృతుల ను పట్టించుకున్న పాపాన పోలేదని అన్నారు. ప్రభుత్వం అందజేస్తున్న బతుకమ్మ చీరలు మన సంస్కృతీ సంప్రదాయాలకు నిలువుటద్దమని అభివర్ణించారు. 2014 కు ముందు  కళ్యాణ లక్ష్మి , షాదీ ముబారక్  , 24 గంటల కరెంట్,  కేసీఆర్ కిట్, రైతు బీమా, రైతు బంధు వంటి పథకాలు లేవన్న మంత్రి ప్రజలను ప్రేమించే సిఎం కేసీఆర్ వచ్చాకే  ఈ పథకాలు వచ్చాయన్న విషయాన్ని గమనించాలి అని కోరారు..ప్రజల పై ప్రేమ ఉన్నప్పుడే అటువంటి పథకాలు వస్తాయన్న ఎమ్మెల్యే మోడీ సొంత రాష్ట్రంలో ప్రజలు తెలంగాణ తరహా పథకాల కోసం డిమాండ్ చేస్తున్నారన్నారు..

ఆ కారణంతోనే టిఆర్ఎస్ ప్రభుత్వం పై మోడీ ప్రభుత్వం కక్ష్య సాధింపు చర్యలకు పూనుకుంటుందని ఆరోపించారు.ఈ కార్యక్రమం లో జడ్పీ వైస్ చైర్మన్ ఇరిగి పెద్దులు, ఎంపీపీ బొల్లం జయమ్మ, జడ్పీటీసీ నందికొండరామేశ్వరిమట్టారెడ్డి, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు చేకూరి హనుమంతరావు, వెనిగండ్ల పిఏసిఎస్ చైర్మన్ కొప్పొలు వెంకటరామారావు,మండల పార్టీ అధ్యక్షుడు తాటి సత్యపాల్, మండల వైస్ ఎంపీపీ వెంకట్ రెడ్డి,మండల పార్టీ ప్రధాన కార్యదర్శి నల్లబోతు వెంకటేశ్వర్లు, మండల సర్పంచ్ ల ఫోరం అధ్యక్షుడు పోలె డేవిడ్, మండల ఎంపీటీసీ ఫోరం అధ్యక్షుడు యాదయ్య, టిఆర్ఎస్ నాయకులు ఉన్నం చిన్న వీరయ్య,రేగులగడ్డ దేవస్థాన చైర్మన్ జాల పాపయ్య, ముప్పారం దేవస్థాన ఛైర్మన్ లింగప్ప, వెంకటరమణ,ముకుందాపురం సర్పంచ్ కేశ శంకర్, బొక్కమంతలపాడు పిల్లి రమేష్,పార్వతీపురం సర్పంచ్ వంక బ్రహ్మన్న, సర్పంచ్ కొండా జానయ్య, గుంటి పల్లి సర్పంచ్ సంద్యారాణిలు,మండల మహిళా విభాగం అధ్యక్షురాలు కళావతి, నిడమానూర్ టౌన్ అధ్యక్షుడు మాచర్ల దాస్, మహిళా అధ్యక్షురాలు రవిరాల శ్రీలత,కో -అప్షన్ నెంబర్ సలీం, సత్యనారాయణ,గడ్డం సత్యనారాయణ రెడ్డి, పొత్తటి యుగేందర్ రెడ్డి ,లక్కామల మధు, తదితరులు పాల్గొన్నారు.