భూమికోసం, భుక్తి కోసం పోరాడిన చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం ఆమె జయంతిని ఘనంగా నిర్వహిస్తున్నది" ---- జిల్లా కలెక్టర్ ఎస్. వెంకటరావు

Submitted by Kramakanthreddy on Tue, 27/09/2022 - 13:02
Recognizing the fighting spirit of Chakali Ailamma, who fought for land and Bhukti, the state government is celebrating her birth anniversary.  ---- District Collector S. Venkatarao

మహబూబ్ నగర్, సెప్టెంబర్ 26 (ప్రజాజ్యోతి ప్రతినిధి) :  సోమవారం చాకలి ఐలమ్మ జయంతిని పురస్కరించుకుని జిల్లా బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బీసీ సంక్షేమ అధికారి కార్యాలయంలో ఏర్పాటుచేసిన చాకలి ఐలమ్మ చిత్రపటానికి జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటరావు పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఆనాటి బానిస సంకెళ్లను తెంచుకొని ఎలా పోరాడాలో చాకలి ఐలమ్మ సమాజానికి నేర్పిందని, ఆమె పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకొని మనం ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని అన్నారు. ముఖ్యంగా వీరనారిగా, భూమికోసం, భుక్తి కోసం పోరాడిన చాకలి ఐలమ్మ తెగువను, పోరాటస్ఫూర్తిని గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం చాకలి ఐలమ్మ జయంతిని రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు.  ఈ కార్యక్రమంలో జిల్లా బీసీ సంక్షేమ అధికారిని ఇందిర, రజక సంఘం రాష్ట్ర కార్యదర్శి వెంకటయ్య, మహిళా సంఘం  జిల్లా అధ్యక్షురాలు బాలమని, మాజీ జిల్లా అధ్యక్షులు నరసింహులు, బుచ్చన్న, సాయికుమార్ , బీసీ సంఘాల నాయకులు, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.