పత్తి,వరి పంటలను పరిశీలించిన ఏ ఈ ఓ రామకృష్ణ .

Submitted by veerareddy on Fri, 23/09/2022 - 13:29
Ramakrishna who examined cotton and rice crops.

 నర్సింహుల పేట సెప్టెంబర్ 22 ప్రజా జ్యోతి,..//   పత్తి, వరి పంటలను పరిశీలించిన ఏ ఈ ఓ రామకృష్ణ. మండలంలోని రామన్నగూడెం లోని పత్తి మరియు వరి పంటలను పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడుతూ  ప్రస్తుతం వివిధ పంటల్లో కనిపిస్తున్న చీడ పిడలు నివారణ చర్యలపై  మాట్లాడుతూ 
1 వరిలో మొగుపురుగు నివారణకు కెల్డన్ 300 గ్రామ్స్ ఒక ఎకరానికి కలిపి పిచికారి చేసుకోవాలి + సాఫ్ 250 గ్రామ్స్ ఎకరానికి కలిపి పిచికారీ చేసుకోవలని ఆయన అన్నారు.2)ఆకుముడత /కాండం తోలుచు పురుగు దీని వలన ఆకులు తెల్లగా మారి లోపలికి ముడుచుకుంటాయి. నివారణ బైఫెంత్రిన్ (సూపర్ స్టార్ లేదా టాల్ స్టార్ ) 320ml/ఎకరానికి 2)క్లోరైపైరిఫోస్ 500ml/ఎకరానికి ఫై రెండు మందుల్లో ఏదో ఒకదానిని పిచికారీ చేసుకోవాలి.పత్తిలో తెల్ల దోమ,పచ్చ దోమ తామర పురుగులు, నివారణకై  1)తియోమెత్తక్సమ్ (అక్టరా ) 40gm/ఎకరానికి 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేసుకోవాలి. మరియు వేప నూనె 500ml ఒక ఎకరానికి కలిపి పిచికారి చేసుకోవాలి.2)ఇమిడా (కాన్ఫిడర్ ) 60ml/యాకరానికి 200 లీటర్ నీటిలో కలిపి పిచికారి చేసుకోవాలి పై మందుల్లో ఏదో ఒక దానిని పిచికారీ చేసుకోవాలి.3.డైఫెంతిరోన్(పోలో )250g/Ac  +ఫార్ములా No 4  250g/Ac   లేదా ఫార్మలా No 6   250g/Ac ఈ కార్యక్రమంలో అబ్బూరి ముకుంద రెడ్డి , పద్మ తదితరులు పాల్గొన్నారు.