సిఎన్జి గ్యాస్ ఉపయోగించి పర్యావరణాన్ని పరిరక్షించండి సుంద రేషన్

Submitted by mallesh on Mon, 19/09/2022 - 16:09
 Protect the environment by using CNG gas  Sunda Ration

చౌటుప్పల్ సెప్టెంబర్ 19 ప్రజా జ్యోతి .../   పర్యావరణాన్ని పరిరక్షించి వాయు కాలుష్యం తగ్గించడానికి పెట్రోలు డీజిల్ స్థానంలో సీఎన్జీ గ్యాస్ ఉపయోగించడం వల్ల వాయు కాలుష్యం తగ్గించవచ్చని జాయింట్ చీఫ్ కంట్రోల్ ఎక్స్ ప్లోజివ్స్ సుంద రేషన్ అన్నారు. జాతీయ రహదారి 65 యెల్లగిరి స్టేజి వద్ద ఏర్పాటుచేసిన సిఎన్జి ఫిల్లింగ్ స్టేషన్ సోమవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా పగిళ్ల సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ సిఎన్జి ఉపయోగించడం వలన వాయు  కాలుష్యాన్ని నియంత్రించి, కేజీ సిఎన్జి గ్యాస్ 22 నుంచి 28 కిలోమీటర్ల వరకు మైలేజ్ ని పొందవచ్చు అని  పేర్కొన్నారు.వాయు కాలుష్యం నియంత్రించడం కోసం వాహనదారులు సిఎన్జి వాడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో చీఫ్ జనరల్ మేనేజర్ సౌత్ సెంట్రల్ జోన్ హరి ప్రసాద్, చీఫ్ రీజినల్ మేనేజర్ రావు సిద్ధార్థ, తదితరులు పాల్గొన్నారు.