తపాలా ప్రమాద బీమా పథకం కుటుంబానికి ధీమా; ఏఎస్పి  రమాదేవి

Submitted by lenin guduru on Fri, 21/10/2022 - 18:00
రమాదేవి

తపాలా ప్రమాద బీమా
పథకం కుటుంబానికి ధీమా;
ఏఎస్పి  రమాదేవి

-రూ.399ల ప్రమాద బీమా పథకానికి రూ.10 లక్షలు

బచ్చన్నపేట, అక్టోబర్ 21, (ప్రజాజ్యోతి): భారత తపాల శాఖ చేపట్టిన తపాల ప్రమాద బీమా పథకం... కుటుంబాలలో ధీమా కల్పిస్తుందని  జనగామ
అసిస్టెంట్ పోస్టల్ సూపర్ డెంట్
 రమాదేవి అన్నారు. 
ఏఎస్పి రమాదేవి
మాట్లాడుతూ పేద మధ్యతరగతి
ప్రజలకు ఉపయోగపడే ప్రమాద విధంగా బీమా రూ.399 లు బీమా పథకానికి రూ. 10 లక్షల వర్తిస్తుందని అన్ని తపాలా
కార్యాలయలలో ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంక్ (ఐపిపిబి) ద్వారా పేమెంట్ చెల్లించి భీమా పొందవచ్చునని సూచించారు. ఒక
ఏడాదికి రూ.399లు చెల్లించి పొందే ప్రమాద బీమా పథకంలో చేరేదుకు బీమా 18ఏండ్ల -65 ఏండ్ల లోపు వయసు కల్గినవారు అర్హులని ఈ బీమా పథకం ద్వారా ప్రమాదంలో మృతి చెందిన... శాశ్వత పాక్షిక అంగవైకల్యం సంభవించిన రూ.10 లక్షల వర్తిస్తుందన్నారు. అవుట్ పేషంట్ కు రూ.30వేలు, ఇన్ పేషెంట్ కు వైద్య ఖర్చుల నిమిత్తం రూ.60వేలు ఆసుపత్రి ఖర్చులు రోజుకు రూ.1000వేలు పది రోజుల వరకు రవాణా ఖర్చులు రూ.25వేలు పాలసీదారు మరణిస్తే ఇద్దరి పిల్లల చదువుల ఖర్చు రూ. లక్ష రుపాయలు అంత్యక్రియలకు రూ. 5వేలు ఈ పథకం ద్వారా అందించనున్నట్లు తెలిపారు. కుటుంబానికి రక్షణ కవచం లాంటి ఈ పథకాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని  బచ్చన్నపేట సబ్ పోస్ట్మాస్టర్ ఎలికట్టె నరేందర్ గౌడ్ పోస్ట్మాస్టర్ బ్రహ్మేశ్వర్ సింగ్ హెచ్ వో  కరికె ప్రసాద్ బాబు కరికె ఎంఓ శ్రీధర్ జిడిఎస్ వీరన్న  పరిష రాములు తదితరులు పాల్గొన్నారు.