ఆదివాసీ ప్రజా ప్రతినిధులను నిలదీసిన ప్రజలు

Submitted by veerareddy on Thu, 22/09/2022 - 12:20
 People who deposed the tribal public representatives


  ఆదివాసీ చట్టాలను అమలు చేయాలని అధికారులను, ప్రజా ప్రతినిధులను నిర్బంధించిన ఆదివాసీలు

  ఆదివాసీల పై మాటల దాడికి దిగిన ఆదివాసీ ప్రజాప్రతినిధులు


వెంకటాపురం (నూగూరు ) సెప్టెంబర్ 21 (ప్రజా జ్యోతి)../  బర్లగూడెం సర్పంచ్ కొర్శా నర్సింహమూర్తి వలస గిరిజనేతరులను ఏజెన్సీ నుండి వెళ్లిపోవాలని, ఎల్టీఆర్ కేసులు నమోదు చేయాలని చేస్తున్న దీక్ష బుధవారం నాటికి 30 వ రోజుకు చేరుకున్నాయి. ఎల్టీఆర్ కేసులు వలస గిరిజనేతరుల పైన ఎందుకు పెట్టడం లేదని వందలాదిమంది ఆదివాసీలు మండల కేంద్రంలో  భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం వందల మంది ఆదివాసీలు మండల ప్రజా పరిషత్తు కార్యాలయాన్ని చుట్టుముట్టారు. అధికారులు పని చేయకుండా అడ్డుకునేది ఆదివాసీ ప్రజా ప్రతినిధులే అన్నారు. ఆదివాసీ ప్రజా ప్రతినిధులు చట్టాలను  ఎందుకు అమలు   చేయడం లేదని ఆదివాసీ మహిళలు నిలదీశారు.  ఆదివాసీ ప్రజా ప్రతినిధులు బయటికి రావాలని వందల మంది  ఆదివాసీలు నినాదాలు చేశారు. బయటికి రావాలని ఆదివాసీలు పట్టుబట్టడంతో ప్రజా ప్రతినిధులు మండల పరిషత్తు కార్యాలయంలో ఉండిపోయారు. ప్రజాప్రతినిధులు బయటకి రాకపోవడంతో అక్కడే బైఠాయించారు. వందల మంది ఆదివాసీలు పెద్ద ఎత్తున దిక్కులు పిక్కటిల్లేలా నినాదాలు చేయడంతో అధికారులు , ప్రజాప్రతినిధులు ఆందోళనకు గురయ్యారు. ఆదివాసీల పక్షమా వలస గిరిజనేతరుల పక్షమా అనిప్రశ్నించారు.

ఆదివాసీ చట్టాలు అమలు చేయకపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. బర్లగూడెం సర్పంచి నర్సింహమూర్తి మాట్లాడుతూ ఆదివాసీ ప్రజాప్రతినిధుల మౌనం భావితరాలకు మరణ  శాశనం అన్నారు. ఎవరి లాభం కోసం ఈ మౌనం అన్నారు. ఏ.ఎన్.ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్  వాసం నాగరాజు మాట్లాడుతూ ఆదివాసీ చట్టాలను అమలు చేయని ప్రజా ప్రతినిధులు తక్షణమే రాజీనామాలు చేయాలని డిమాండ్ చేసారు. ఆదివాసీ ప్రజలను చైతన్యం చేస్తామని, ప్రజలను ప్రశ్నించేలా చేయడం నిమగ్నం అవుతానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలోసుభద్ర,రాధ, విజయ్, కురసం వెంకటేష్, ఇర్ప రవి  మండలంలోని సుమార అధికసంఖ్యలో ఆదివాసీలు ఈ ముట్టడి కార్యక్రమంలో పాల్గొన్నారు.