రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమ పథకాలు అన్ని రాష్ట్రాలకు వర్తింపచేయాలని ప్రజల కోరుతున్నారు

Submitted by Sathish Kammampati on Sun, 25/09/2022 - 13:16
People want development welfare schemes in the state to be applied to all states

నల్లగొండ జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ బండ నరేందర్ రెడ్డి

నల్లగొండ సెప్టెంబర్ 24(ప్రజాజ్యోతి).//.. నల్లగొండ జిల్లా, నకిరేకల్  నియోజకవర్గం, నార్కెట్‌పల్లి మండలం, నార్కెట్‌పల్లి  పట్టణ కేంద్రంలో శనివారం రోజున తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన బతుకమ్మ చీరల పంపిణీ మరియు ఆసరా  పెన్షన్ల కార్డులు లబ్ధిదారులకు  పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన నల్లగొండ జిల్లా ప్రజా పరిషత్ చైర్మెన్ బండ నరెందర్ రెడ్డి. ఈ సందర్భంగా జిల్లా ప్రజా పరిషత్ చైర్మెన్ మాట్లాడుతూ మొదటగా తెలంగాణ ఆడ పడుచులకు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. దేశములో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నాయని అన్నారు. బతుకమ్మ పండుగను దృష్టిలో వుంచుకొని రాష్ట్రంలో ప్రతి ఆడపడుచు బతుకమ్మ పండుగను ఆనందంగా, సంతోషంగా జరుపుకోవాలని ఆకాంక్షిస్తు మన ప్రియతమ ముఖ్యమంత్రి పండుగకు కానుకగా చీరలు పంపిణీ కార్యక్రమం చేపట్టారని అన్నారు. దేశములో ఏ రాష్ట్రంలో లేని విధంగా నేడు మన కెసిఆర్ ఆడపిల్లలకు గురుకులాలు, షీ టీం లను, ఆడపడుచు ప్రసూతి అయితే కెసిఆర్ కిట్టు, షాది ముభారక్ కళ్యాణ లక్ష్మి,వితంతు పెన్షన్, ఒంటరి మహిళలకు పెన్షన్ వంటి బృహత్తర కార్యక్రమాలను తెలంగాణ ఆడపడుచుల కొరకు ప్రవేశ పెట్టారని అన్నారు. అదే విధంగా రైతులకు ఉచితంగా 24 గంటలు నాణ్యమైన  కరెంటు,రైతు బందు, రైతు భీమా వంటి కార్యక్రమాలు మన తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే మన తెలంగాణ రైతాంగ అప్పుల ఊబిలో  నుండి బయటపడి, వారే పదిమందికి సహాయం చేసే స్థాయికి మన ముఖ్యమంత్రి కెసిఆర్ కృషి చేసారని అన్నారు.

అదే విధంగా తెలంగాణ రాష్ట్రంలో  దళితుల అభ్యున్నతికి కొరకు దళిత బందు పథకం పేరుతో 10 లక్షల రూపాయలు ఇచ్చిన ఏకైక ముఖ్యమంత్రి మన కెసిఆర్ ని అన్నారు. అదే విధంగా గిరిజనులకు రిజర్వేషన్ కల్పిస్తే వారికి అభివృద్ధిలోకి వస్తారని 10 శాతం రిజర్వేషన్లు పెంపుకు కృషి చేస్తున్నారని అన్నారు. సబ్బండ వర్గాల శ్రేయస్సు కోరే నాయకులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ ని అన్నారు. అందుకే యావత్ దేశ ప్రజలు కెసిఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మెన్ రేగట్టె మల్లికార్జున్ రెడ్డి, స్థానిక ఎంపీపీ సూదిరెడ్డి నరెందర్ రెడ్డి, టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు బైరెడ్డి కరుణాకర్ రెడ్డి, ఎంపీటీసీలు పుల్లెంల ముత్తయ్య, సర్పంచ్ దూదిమెట్ల స్రవంతి, నాయకులు దుబ్బాక శ్రీధర్, బద్దం రాంరెడ్డి, బత్తిని రమేష్, ఎంపీడీవో యాదగిరి, గ్రామ కార్యదర్శి, ఏపిఎం శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.