బీజేపీ ఆధ్వర్యంలో ఘనంగా పండిట్ దీన్ దయాల్ జయంతి ఉత్సవాలు

Submitted by Degala shankar on Mon, 26/09/2022 - 13:46
Pandit Deen Dayal's birth anniversary celebrations under the auspices of BJP


ఆదిలాబాద్ బ్యూరో సెప్టెంబర్ 25, (ప్రజా జ్యోతి)//భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకులు పండిట్ దీన్ దయల్  జయంతిని బీజేపీ జిల్లా కార్యాలయంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. జిల్లా అధ్యక్షులు పాయల్ శంకర్ ఆధ్వర్యంలో ధీన్ దయాల్ చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సంధర్బంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు పాయల శంకర్ మాట్లాడుతూ దీన్ దయల్  గొప్ప వ్యక్తి అని, దేశం కోసం తన సర్వస్వాన్ని ధార పోశారన్నారు, ప్రభుత్వ అభివృద్ధి పథకాలు సమాజంలోని బడుగు, బలహీన వర్గాల వారికి అందాలన్న ఉద్దేశ్యంతో ఏకాత్మత, మానవత స్సూత్రాన్ని, అంత్యోదయ సిద్ధాంతాన్ని ప్రతిపాదించారని, ఆయన ఆశయాలకు అనుగుణంగా నేడు బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోదీ  నాయకత్వం నడుస్తుందని అన్నారు. రాష్ట్ర నాయకత్వం ఆదేశాల మేరకు బూతు స్థాయి లో ప్రతి కార్యకర్త మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపడుతున్నారన్నారు. 
పట్టణం లోని 47 వ వార్డుల్లో కార్యకర్తలతో కలిసి ఆయన మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకురాలు చిట్యాల సుహాసిని రెడ్డి, జిల్లా నాయకులు అకంత్ రమేష్, అధినత్, ఆకుల ప్రవీణ్, లాలా మున్న, జోగు రవి, సోమ రవి, లోక ప్రవీణ్ రెడ్డి, దినేష్ మటోలియ,  రాజేష్, మయూర్ చంద్ర, శ్రీనివాస్, రత్నాకర్ రెడ్డి, విజయ్ మహేందర్, ముకుంద్, రాజన్న, నగేష్, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

బోథ్ లో.....
మండల బీజేపీ అద్వర్యంలో దీనదయాళ్ జయంతి వేడుకలు ఆదివారం ఘనంగా జరుపుకున్నారు.భారతీయ జనతాపార్టీ బోథ్ మండల ఇంచార్జీ, గిరిజన మోర్చ రాష్ట్ర అధికార ప్రతినిధి సాకటి దశరథ్ ఆధ్వర్యంలో మండల కార్యాలయంలో పండిత్ దీనదయాళ్ ఉపాధ్యాయ  జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన సమాజకోసం చేసిన కృషిని కొనియాడారు.ఈ సందర్భంగా సాకటి దశరథ్  మాట్లాడుతూ ఏకత్మత, మానవతావాదం అను సిద్దాంతాన్ని ప్రతి పాదించారని, ఆధ్యాత్మిక  దృష్టితో మానవ సేవ చేయడమే జీవిత విధానమని వాదించాడని, మానవుని  శరీరం, మనసు, తెలివితేటలు ఆత్మ, ఏకకాలం సమగ్ర కార్యక్రమాన్ని సూచించే సమగ్ర మానవత వాదం అనే రాజకీయ తత్వాన్ని ఉపాధ్యాయ రూపొందించారని అన్నారు. ఆయన చూపిన మార్గంలో ప్రతి ఒక్కరూ నడుచు కోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా నాయకులు , మండల నాయకులు,కమిటి సభ్యులు,కార్యకర్తలు పార్టీ అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.