పంచాయతీ ట్రాక్టర్ కదా..అన్ని పనులకు వాడేద్దాం???

Submitted by venkat reddy on Fri, 23/09/2022 - 11:58
Panchayat tractor or not..let's use it for all works???
  • - పంచాయతీ ట్రాక్టర్ ను సొంత అవసరాలకు వినియోగిస్తున్న  సర్పంచ్
  • -మొదటి సారి ఉన్నాతాధికారులను తప్పుగా క్షమించండి అన్న సర్పంచ్...
  • -మరల నేడు అదే తప్పులు పునరావృతం చేస్తున్న సర్పంచ్
  • ఫోటో రైటప్ ఃపంచాయతీ ట్రాక్టర్ ను సొంత అవసరాలకు వినియోగిస్తున్న  సర్పంచ్
  • ఫోటోరైటప్ ఃపంచాయతీ ట్రాక్టర్ లో రాళ్లను తరలిస్తున్న

నిడమనూరు, సెప్టెంబర్ 22(ప్రజాజ్యోతి):పంచాయతీ ట్రాక్టర్ కదా..అన్ని పనులకు వాడేసుకుందామని మిర్యాలగూడ మండలం జప్తివీరప్పగూడెం సర్పంచ్ నిర్వాకం ఇలా ఉంది మరిమన పంచాయతీ ట్రాక్టర్ కదా..సర్పంచ్ మనమే కదా...మనకు ఎదురులేదు...గ్రామంలో మనం చెప్పిందే వేదం..అంటు పంచాయతీ ట్రాక్టర్ ను  గ్రామ సర్పంచ్ తన సొంత అవసరాలకు ఉపయోగించుకుంటున్నారని    గ్రామస్థులు సర్పంచ్ ని నిలదీసిన సంఘటన మిర్యాలగూడ మండలం జప్తివీరప్పగూడెం గ్రామంలో గురువారం చోటుచేసుకుంది.స్థానిక ప్రజలు, గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం మిర్యాలగూడ మండలం జప్తివీరప్పగూడెం గ్రామంలో  గ్రామ సర్పంచ్ పేలపోలు శ్రీలత పంచాయతీ ట్రాక్టర్ ను వారి సొంత అవసరాలకు  వినియోగిస్తున్నారు.గురువారం సర్పంచ్  
వ్యవసాయ భుమిలో నుంచి రాళ్లను పంచాయతీ ట్రాక్టర్ ,పంచాయతీ తాత్కాలిక డ్రైవర్ గా సండ్రాల దేవయ్య పనిచేస్తున్నాడు.ఆ వ్యక్తిని అడ్డు గా పెట్టుకుని  పంచాయతీ ట్రాక్టర్ ద్వారా రాళ్లను తరలిస్తుండగా  ట్రాక్టర్ ను గ్రామస్తులు అడ్డుకొని సంబంధిత గ్రామ కార్యదర్శికి ఫోన్ చేసి పంచాయతీ ట్రాక్టర్ ను  సర్పంచ్  సొంత పనులకు ఉపయోగించే విషయం చెప్పితే పంచాయతీ కార్యదర్శి నిర్లక్ష్యం గా సమాధానం తెలిపారు.వెంటనే గ్రామస్థులు పంచాయతీ ఉన్నతాధికారులకు  తెలియజేశారు. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసిన కొద్ది సమయంలో పంచాయతీ కార్యదర్శి సంఘటన స్థలానికి చేరుకున్నారు. గతంలో కూడా మరో కార్యదర్శి ఉన్నప్పుడు సొంత అవసరాలకు ఉపయోగిస్తే వార్డు మెంబర్స్, గ్రామ పంచాయతీ ట్రాక్టర్ ను సర్పంచ్ సొంత పనులకు వినియోగిస్తున్నారని డి పి ఓ కు ఫిర్యాదు చేశారు.

డి పి ఆర్ ఓ వచ్చి విచారణ చేసి వాస్తవం అని తేల్చారు.అప్పుడు సర్పంచ్  ఇది మొదటి తప్పుగా భావించి మరల సర్పంచ్ నా సొంత పనులకు పంచాయతీ  ట్రాక్టర్ ను ఉపయోగించను అని లిఖిత పూర్వకంగా  వ్రాసి ఇచ్చారు.మరలా గ్రామపంచాయతీ ట్రాక్టర్ ను సొంత పనులకు ఉపయోగిస్తే కఠినమైన చర్యలు ఉన్నతాధికారులు తీసుకుంటామని హెచ్చరించారు. ‌అయినా కాని గురువారం ఇప్పుడు మరల  సర్పంచ్, కార్యదర్శి ఒకటై మరలా అదే పని చేస్తున్నారని స్థానిక ప్రజలు ఆరోపించారు.పంచాయతీ సర్పంచ్ సర్పంచ్ ,కార్యదర్శి ఇష్టారాజ్యంగా  వ్యవహరిస్తున్నారని స్థానిక ఎంపీటీసీ గ్రామస్తులు ,తీవ్ర  విచారణ వ్యక్తం చేస్తున్నారు.