సీఐటీయూ 12 మహాసభల కరపత్రం ఆవిష్కరణ

Submitted by Sathish Kammampati on Wed, 14/09/2022 - 17:16
Pamphlet launch of CITU 12 Congresses
  • నవంబర్ 11,12,13 తేదీలలో నల్లగొండ జిల్లా సిఐటియు 12వ మహాసభలను జయప్రదం చేయాలి
  •  
  •  సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు నారాబోయిన  శ్రీనివాస్ 

చిట్యాల సెప్టెంబర్ 14(ప్రజాజ్యోతి) జరగబోయే మహాసభలు చారిత్రక నేపథ్యం కలిగిన పోరాటాల గడ్డ చిట్యాల పట్టణంలో జరుగుతున్నందున ఈ మహాసభలను జయప్రదం చేయాలని బుధవారం స్థానిక మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జనరల్ బాడీ సమావేశంలో కరపత్రాన్ని విడుదల చేస్తూ సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు నారబోయిన శ్రీనివాస్ మాట్లాడుతూ చిట్యాల ప్రాంతంలో గతంలో యూనియన్లు పెట్టి హక్కుల కోసం పోరాటం చేస్తున్న సందర్భంలో యాజమాన్యాలు కార్మికుల డిమాండ్లను పరిష్కరించకుండా నిర్లక్ష్యం చేయడం వల్ల సమ్మె చేసి హక్కులు సాధించుకున్న పోరాటాల గడ్డ చిట్యాల అని అన్నారు.

ఆ ఉద్యమ స్ఫూర్తితో నాటి నుండి నేటి వరకు కార్మిక వర్గ పోరాటాలు నిరంతరం హక్కుల సాధన కోసం పోరాడుతు అనేక విజయాలు సాధించిన సంగం సిఐటియు అని ఈ స్ఫూర్తితో చిట్యాల మహాసభలు నిర్వహిస్తున్నామని గత మూడు సంవత్సరాల కాలంలో ప్రభుత్వాల మీద పోరాడి సాధించుకున్నా హక్కులు నెమరు వేసుకుంటూ భవిష్యత్ కార్యక్రమాన్ని రూపొందించుకోవడం కోసం ఈ మహాసభలు నిర్వహిస్తున్నారు. ఈ ప్రాంత ఉద్యోగులు వ్యాపారులు కార్మికులు ప్రజలు తమ ఆర్థిక హార్దిక సహాయ సహకారాలు అందించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము.కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక విధానాలతో పోరాడి సాధించుకున్న 44కార్మిక చట్టాలను 4 కోడ్ లోగా తీసుకరావడం వల్ల కార్మిక ప్రయోజనాలకు కంటే పెట్టుబడిదారుల ప్రయోజనాలు ఉపయోగపడే విధంగా ఉన్నాయని అన్నారు. 8 గంటల పని విధానాన్ని 12 గంటల పని విధానాన్ని అమలు చేస్తున్నారని

దీనిపై కార్మికులు పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహించాలని కోరారు.ఈదేశంలో రాష్ట్రంలో ఉన్న సంఘటిత అసంఘటితకార్మికులకు సమాన పనికి సమాన వేతనాన్ని చట్టం చేసి అమలు చేయాలని డిమాండ్ చేశారు.పెరిగిన నిత్యవసర వస్తువులు ధరల్ని నియంత్రించాలని బిజెపి మతోన్మాద రాజకీయాల్లో కార్మిక వర్గంలో చిచ్చు పెట్టాలని చూస్తుందని ఈ విధానంపై కార్మికుల తిప్పి కొట్టాలని కోరారు.ఈ సమావేశంలో యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు ఏనుగు వెంకట్ రెడ్డి,రుద్రవరం నరసింహ,జడల నరసింహ,బాకీ అండాలు,రేముడాల ఉపేందర్,కట్ట రామకృష్ణ, పోలే సైదులు,పిల్లి కవిత తదితరులు పాల్గొన్నారు.