సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం

Submitted by bosusambashivaraju on Sun, 02/10/2022 - 16:21
Palabhishekam for CM KCR's film

గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్లు అమలు కోసం జీవో నెం.33 జారీ......ఎమ్మెల్యే రాజయ్య

స్టేషన్ ఘనపూర్, అక్టోబర్ 02 ( ప్రజజాజ్యోతి ) :- స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నందు

గిరిజనులకు రిజర్వేషన్లు 10 శాతము అమలు కోసం జి.ఓ.నెం:33 జారీ చేసినందుకు కృతజ్ఞతగా ఆదివారం మార్కెట్ మాజీ వైస్ ఛైర్మన్, జనగామ జిల్లా దిశ కమిటీ మెంబెర్ మాలోతు రమేష్ నాయక్ ఆధ్వర్యంలో గిరిజనులు ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో చెప్పినట్టుగా చిన్న రాష్ట్రాలు అభివృద్ధికి సోఫానాలని చెప్పినట్టుగా తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ కొత్త జిల్లాలు , కొత్త రెవిన్యూ డివిజన్స్ , కొత్త మండలాలు, కొత్త గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమ కాలంలో కెసిఆర్ చెప్పినట్టుగా  

మా తండాలో- మా రాజ్యం అనే నినాదంతో లంబాడి తండాలను , ఆదివాసి గూడాలను గ్రామ పంచాయతీలుగా చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఘనపూర్ చిల్పూర్ ఎస్టీ సెల్ అధ్యక్షులు నునవత్ జెపాల్ నాయక్, మాలోతు నవీన్ నాయక్, జిట్టాగూడం ఉప సర్పంచ్ రవీందర్ నాయక్, గ్రామ అధ్యక్షులు జెపాల్ నాయక్, వార్డ్ మెంబెర్ రమేష్, యూత్ నాయకులు గుగులోత్ సమ్మన్నా నాయక్, లాలు, గణ్య, దశ్రు, సుందర్, ప్రమీల, మహిళలు, లంబాడ నాయకులు రాజశేఖర్, రవి,అందుబాటులో ప్రజాప్రతినిధులు , ముఖ్య నాయకులు , పార్టీ ప్రతినిధులు , బంజారా సర్పంచులు , ఎంపీటీసీలు , గిరిజనులు, పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.