'డా కేర్ పోసిటివ్ హోమియోపతి' ఆధ్వర్యంలో బిఎస్ఎన్ఎల్ జిఎం ఆఫీస్ లో ఉచిత వైద్య శిబిరం.

Submitted by Praneeth Kumar on Sat, 26/11/2022 - 21:16
Free Medical Camp at BSNL GM Office under 'Dr Care Positive Homeopathy'.

'డా కేర్ పోసిటివ్ హోమియోపతి' ఆధ్వర్యంలో బిఎస్ఎన్ఎల్ జిఎం ఆఫీస్ లో ఉచిత వైద్య శిబిరం.

ఖమ్మం అర్బన్, నవంబర్ 26, ప్రజాజ్యోతి.

'డా కేర్ పోసిటివ్ హోమియోపతి' ఆధ్వర్యంలో శనివారం బిఎస్ఎన్ఎల్ జిఎం ఆఫీస్ లో ఎన్ఎఫ్టిఈ యూనియన్ మీటింగ్ సందర్భంగా ఉచిత హోమియోపతి వైద్య శిబిరం నిర్వహించారు. ఈ వైద్య శిబిరాన్ని ఏజిఎం గోవింద్ ప్రారంభించారు. ఈ వైద్య శిబిరంలో 'డా కేర్' వైద్యులు డా.రాజేష్ బాబు పాల్గొని బిఎస్ఎన్ఎల్ ఉద్యోగులందరికి వైద్యపరీక్షలు నిర్వహించారు. అనంతరం డా కేర్ సిబ్బంది అక్యూట్, క్రానికల్, పిసిఓడి, సొరియాసిస్, కీళ్ల నొప్పులు, సైనస్, డయాబిటిక్ వ్యాధులకు హోమియోపతి వైద్యం ప్రాముఖ్యతను ఉద్యోగులకు అవగాహన కల్పించారు. బిఎస్ఎన్ఎల్ ఏజిఎం గోవింద్ మాట్లాడుతూ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేనిది హోమియోపతి వైద్యం అని, ఇంకా ఇలాంటి కాంప్ లు మున్ముందు నిర్వహించి ఈ వైద్యం ప్రాముఖ్యతను జనాల్లోకి మరింతగా తీసుకువెళ్లాలన్నారు. ఈ క్యాంపు ను బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ లో నిర్వహించినందుకు డా కేర్ పోసిటివ్ హోమియోపతి సంస్థకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిజిఎం నవీన, ఏజిఎం మార్కెటింగ్ సుష్మ, జెఈ దుర్గారావు, ఎన్ఎఫ్టియు యూనియన్ లీడర్ లు, డా కేర్ ఖమ్మం బ్రాంచ్ పిఆర్ఓ ప్రణీత్ కుమార్, ఇతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.