కృష్ణంరాజు మరణ వార్త తీవ్ర దిగ్బ్రాంతికి గురిచేసింది

Submitted by Gonela Kumar on Sun, 11/09/2022 - 14:11
The news of Krishna Raja's death caused a great shock
  • మంచి మిత్రుణ్ణి కోల్పోయాను 
  •  తెలుగు రాష్ట్ర రాజకీయాలకు తీరని లోటు
  • హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ


 హైదరాబాద్ సిటీ/ప్రజాజ్యోతి ; రెబల్ స్టార్  యు. వి. కృష్ణంరాజు మాజీ కేంద్ర మంత్రి  మరణ వార్తా తనను తీవ్ర  దిగ్బ్రాంతికి గురిచేసిందని హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ ఈమేరకు విడుదల చేసిన పత్రిక ప్రకటన లో పేర్కొన్నారు.

వారు గొప్ప సినీ నటులు, మంచి కళాకారులు,లక్షలాది మంది హృదయాల్లో స్థానాన్ని సంపాదించిన మహా నాయకులని దత్తాత్రేయ కొనియాడారు.రాజకీయాల్లో జాతీయ భావాలు,దేశ భక్తి, క్రమశిక్షణకు వారు పెట్టింది పేరు.అటల్ బిహారి వాజపేయి ప్రభుత్వంలో కేంద్ర రక్షణ మరియు గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రిగా తనతోపాటు పనిచేసి మచ్చలేనటువంటి నాయకునిగా పేరు గడించారని  దత్తాత్రేయ గుర్తుచేసుకున్నారు.  

కృష్ణంరాజు సృజనాశీలి, మృదు స్వభావి, నిగర్వి అని, చక్కటి గౌరవ మర్యాదలు కలిగినటువంటి నాయకులని ఆయన పేర్కొన్నారు. తాను కృష్ణంరాజును భారతీయ జనతా పార్టీ లో చేరాల్సిందిగా 1997 లో అడిగిన వెంటనే పార్టీ లో చేరి కాకినాడ నుండి పార్లమెంట్ సభ్యునిగా పోటీచేసి గొప్ప మెజారిటీ తో గెలుపొందారని గుర్తుచేసుకున్నారు.వారి సేవలు ఆంధ్ర రాష్ట్రానికి అపారమని అన్నారు.వారి మృతితో తాను ఒక మంచి మిత్రుణ్ణి కోల్పోయానని, వారి మరణం సినీ లోకానికి మరియు తెలుగు రాష్ట్ర రాజకీయాలకు తీరని లోటు అని పేర్కొన్నారు. 

కృష్ణంరాజు మాజీ కేంద్ర మంత్రి గారి మృతి పట్ల తన ప్రగాఢ సంతాపాన్నితెలియజేస్తున్నాని, వారి ఆత్మకు శాంతికి కలిగించాలని, వారి కుటుంబ సభ్యులకు ఈ శోకాతప్త సమయాన శక్తిని, మనోధైర్యాన్ని ప్రసాదించాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.