ముస్తాబైన కనకదుర్గ ఆలయాలు.. -రేపటి నుంచే నవరాత్రి ఉత్సవాలు

Submitted by venkat reddy on Sun, 25/09/2022 - 13:08
Mustabaina Kanakadurga Temples.. Navratri celebrations from tomorrow

నిడమనూరు, సెప్టెంబర్24(ప్రజాజ్యోతి):  తెలంగాణ రాష్ట్రంలో కనకదుర్గమ్మ ఆలయంలో నిర్వహించే దసరా ఉత్సవాలు ప్రత్యేకమైనవి.కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయంలో పూజలందుకునే జగన్మాత, నవరాత్రుల్లో వివిధ రూపాల్లో దర్శనమివ్వనుంది.దసరా మహోత్సవాలకు రాజన్నగూడెంలోని కనకదుర్గమ్మ ఆలయం మహ అద్బుతంగా ముస్తాబైంది. భాద్రపద మాసం తొలి దుర్గామాత సన్నిధిలో శరన్నవరాత్రులను ఘనంగా నిర్వహించేందుకు ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. రాజన్నగూడెం కనకదుర్గమ్మ ఆలయంలో సెప్టెంబర్‌ 26 నుంచి 04 వరకు నవరాత్రి వేడుకలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. ఆశ్వయుజ పాడ్యమి నుంచి దశమి వరకు అమ్మవారు ఒక్కో రోజు ఒక్కో రూపంలో దర్శనమివ్వనున్నారు. తొలి కనకదుర్గ అలంకరణ, రెండోవ రోజు బాలత్రిపుర సుందరి అలంకరణ,మూడొవ రోజు గాయత్రి దేవి అలంకరణ ,నాల్గొవ రోజు అన్నపూర్ణ దేవి అలంకరణ, ఐదోవరోజు లలిత త్రిపుర సుందరి దేవి అలంకరణ,ఆరోవ రోజు మహలక్ష్మీఅవతారం, ఏడోవ రోజు సరస్వతి దేవి,ఎనిమిదో రోజు దుర్గాదేవి, తొమ్మిదొవ రోజు మహిషాసురమర్థిని అలంకరణ సాయంత్రం శివ పార్వతుల శాంతికళ్యాణం,ఉరేగింపు భక్తులను అనుగ్రహిస్తారు.దసరా ఉత్సవాల సందర్భంగా కనకదుర్గమ్మను దర్శించుకోడానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తారు. ఈ ఏడాది సుమారు 5వేల మంది వరకూ భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే ఆలయ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.వాహనాల రాకపోకలకు ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ కమిటీ ముందస్తు చర్యలు తీసుకున్నారు. భక్తుల వాహనాలకు పార్కింగ్‌ ప్రదేశాలు సిద్ధం చేశారు.