మునుగోడు నియోజకవర్గ ఆర్టీసీ కార్మికుల ఆత్మీయ సమ్మేళన సమావేశం

Submitted by mallesh on Mon, 19/09/2022 - 11:40
Munugodu Constituency RTC workers spiritual meeting
  • ఆర్టీసీ కార్మికులు ఆత్మ గౌరవం చంపుకుని పనిచేస్తున్నారు 
  • సమస్యలు పరిష్కరించకపోతే మునుగోడు ఉప ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్తాం

చౌటుప్పల్ సెప్టెంబర్ 18 ప్రజా జ్యోతి//. పెండింగులో ఉన్న 2 పే స్కేల్ 6 డిఏ లను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని మునుగోడు నియోజకవర్గ ఆర్టీసీ కార్మికుల కన్వీనర్ కె రాజిరెడ్డి అన్నారు.ఆదివారం  చౌటుప్పల్ నిర్వహించిన మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ ఆర్టీసీ ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనం లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ గత కొంతకాలంగా పోరాటం చేస్తున్న, సమస్యల పరిష్కారం కోసం వెల్ఫేర్ కమిటీ వేసి తొమ్మిది నెలలు గడుస్తున్నా సమస్యలను పక్కనపెట్టి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాలయాపన చేస్తుందని పేర్కొన్నారు.స్లీపర్ కోచ్ ఎలక్ట్రిక్ అద్దె బస్సులు తీసుకువచ్చి, ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టి ఆర్టీసీ కార్మికులకు అన్యాయం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు లో కీలకపాత్ర వహించిన ఆర్టీసీ కార్మికులకు సీఎం కేసీఆర్ పట్టించుకోకపోవడం బాధాకర విషయం అన్నారు.

నీళ్లు నిధులు నియామకం కోసం తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో సకాలంలో జీతాలు రాక ఆత్మ గౌరవం చంపుకొని విధులు నిర్వహిస్తున్నామన్నారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించకపోతే మునుగోడు ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్తానన్నారు. 15% శాతం ఐఆర్, 30% ఫిట్మెంట్ ను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మునుగోడు అసెంబ్లీ ఆర్టీసీ కో కన్వీనర్ ఎన్ వి చారి , ఈ శంకర్, గౌరవ సలహాదారుడు బూడిద జగన్ మోహన్ రెడ్డి, ఆర్టీసీ ఆత్మీయ సమ్మేళనం అధ్యక్షుడు సుర్కంటి మోహన్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.