స్వచ్ఛ గురుకుల్ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీపీలు

Submitted by sridhar on Thu, 08/09/2022 - 09:28
MPPs participating in Swachh Gurukul programme


గద్వాల ప్రతినిది (ప్రజాజ్యోతి) సెప్టెంబర్ 07 :తెలంగాణ రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ పిలుపునిచ్చిన స్వచ్ఛ గురుకుల్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు గట్టు మండల కేంద్రంలో గల సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల గట్టు మరియు మానవపాడు పాఠశాలల  విద్యార్థులతో కలిసి గట్టు ఎంపీపీ విజయ్ కుమార్ మరియు మానవపాడు ఎంపీపీ అశోక్ రెడ్డి పాల్గొని స్వచ్ఛతపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో భాగంగా మూడో రోజు అయిన బుధవారం పాఠశాలలో టాయిలెట్లు, వాష్‌రూమ్‌లు, హ్యాండ్‌వాష్‌ ఏరియాలు, వాటర్‌ట్యాంకులు, డ్రైనేజీ బ్లాక్‌లు, డ్రెయిన్‌ అవుట్‌లెట్లు, వాటర్‌ లాగింగ్‌ ఏరియాలు మొదలైన వాటిని శుభ్రం చేయించడం జరిగింది.

ఎంపీపీ మాట్లాడుతూ స్వచ్ఛ గురుకుల్ కార్యక్రమాన్ని ఒక మంచి అవకాశంగా సద్వినియోగం చేసుకొని గురుకులాల స్వచ్ఛత కొరకు అందరూ చేయి చేయి కలిపి ముందుకు సాగాలన్నారు.వ్యక్తిగత పరిశుభ్రత ,పాఠశాల పరిశుభ్రత ఏ ఒక్క అధికారి బాధ్యత కాకుండా ప్రతి విద్యార్థి తమదిగా భావించి తమ వ్యక్తిగత బాధ్యతగా భావించినప్పుడు మాత్రమే పాఠశాలలు పచ్చదనంతో కళకళలాడుతాయి అన్నారు.

పాఠశాలలో ఏదో ఒక ఇబ్బంది జరిగినప్పుడు అధికారులను తప్పు పట్టడం కాకుండా పాఠశాలల పరిశుభ్రత కొరకు ప్రతి ఒక్కరు నడుం బిగించాలని విద్యార్థులకు తెలిపారు.ఈ కార్యక్రమంలో మానవపాడు ఎంపీపీ అశోక్ రెడ్డి, గట్టు సర్పంచ్ శ్రీమతి ధనలక్ష్మి, జడ్పీ కో ఆప్షన్ సభ్యులు ఇమాంసాబ్, గురుకుల పాఠశాలల ప్రధానో ప్రధానోపాధ్యాయులు వాణి , ఖేజియా, ,మాచర్ల  ఆలీ ,బుడ్డప్ప, డాక్టర్ సురేష్, రవి, గద్వాల తిమ్మప్ప, రవి సుదర్శన్  భాస్కర్ పేరెంట్స్ కమిటీ అధ్యక్షులు లక్ష్మన్న గట్టు గ్రామపంచాయతీ సిబ్బంది టిఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.