స్వచ్ఛ గురుకుల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీపీ

Submitted by sridhar on Tue, 06/09/2022 - 10:33
MP who participated in the inauguration of Swachh Gurukul

గద్వాల ప్రతినిది (ప్రజాజ్యోతి) సెప్టెంబర్ 05: జోగులాంబ గద్వాల జిల్లా,గట్టు మండల కేంద్రంలోని గురుకుల పాఠశాలలలో "స్వచ్ఛ గురుకుల్" కార్యక్రమంలో ఎంపీపీ విజయ్ కుమార్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా సోమవారం నుంచి 11వ తేదీ వరకు గురుకులాలలో పారిశుద్ధ్య కార్యక్రమాల నిర్వహణకై స్వచ్ఛ గురుకుల్ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా విచ్చేశారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జయంతిని పురస్కరించుకుని ఉపాధ్యాయులకు జాతీయ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

ఎంపీపీ మాట్లాడుతూ విద్యార్థులు వ్యక్తిగత పరిశుభ్రత మరియు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుని విద్యార్థులు ఏకాగ్రతతో చదవి మంచిమార్కులు సాదించాలని ఆయన ఆకాంక్షించారు.స్వచ్చందంగా తమ పాఠశాలను పరిశుభ్రంగా ఉంచుకుకోవాలని, వ్యక్తి గత పరిశుభ్రత అలవాట్లు అలవర్చుకోవాలి సూచించారు.పాఠశాల విద్యార్థులలో ఉన్న సృజనాత్మకతను వెలికితీయడానికి చిత్రకళ, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించుకోవాలని తెలిపారు.
పాఠశాల ఆవరణమును పరిశుభ్రంగా ఉంచుకోవాలని తెలిపారు.

ఈ సందర్భంగా విద్యార్థులతో మాట్లాడి వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు.గురుకుల పాఠశాలలో ప్రతి రోజు ఒక కార్యక్రమం చేపట్టడం ద్వారా పాఠశాలలు పల్లెప్రగతి కార్యక్రమంలో స్వచ్ఛ గ్రామాల వలె రూపుదిద్దుకుంటాయని తెలిపారు.ఈ కార్యక్రమంలో  గట్టు సర్పంచ్ శ్రీమతి ధనలక్ష్మి ,గురుకుల ప్రిన్సిపల్ శ్రీమతి వాణి, వైస్ ప్రిన్సిపల్ శ్రీమతి గీత దేవి, వేణుగోపాల్ ,ఉపాధ్యాయులు విద్యార్థుల తల్లిదండ్రులు విద్యార్థులు మీడియా మిత్రులు గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.