సాయుధ పోరాట స్ఫూర్తితో ఉద్యమించాలి

Submitted by venkat reddy on Tue, 13/09/2022 - 14:10
Movement should be carried out in the spirit of armed struggle
  • సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు కొండేటి శ్రీను 
  •  అమరవీరుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళ్లు అర్పిస్తున్న సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు కొండేటి శ్రీను 

 నిడమనూరు, సెప్టెంబర్ 13(ప్రజాజ్యోతి):కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజావ్యతిరేక నిరంకుశ విధానాలపై ప్రజలు నాటి తెలంగాణ సాయుధ పోరాట స్పూర్తితో ఉద్యమించాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు కొండేటి శ్రీను పేర్కొన్నారు. మంగళవారం స్థానిక సిపిఎం పార్టీ కార్యాలయంలో తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్న అమరవీరులను గుర్తు చేసుకున్నారు. అనంతరం  అమరవీరుల చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ భూమి కోసం భుక్తి కోసం వెట్టి చాకిరి విముక్తి కోసం జరిగిన తెలంగాణ సాయుధ పోరాటంలో నిజాం నిరంకుశత్వాన్ని ఎదిరించి పేదలకు రూ.4 లక్షల ఎకరాల భూమిని చరిత్ర కమ్యూనిస్టులకు దక్కిందన్నారు. అనేక మంది యోధులు అమరుల అయ్యారన్నారు. నేటి సమాజానికి ఆదర్శమని.. నిజాం నవాబుకు ఏ మాత్రం తీసిపోని విధానాలు ప్రస్తుత ప్రభుత్వాలు అనుసరిస్తున్నాయి.అన్ని విధానాలకు వ్యతిరేకంగా ప్రజలను చైతన్య పరిచేందుకు కమ్యూనిస్టులు ముందుంటారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి కందుకూరి కోటేష్ ,మండల కమిటీ సభ్యులు కోమండ్ల గురవయ్య ,వింజమూరి శివ,పుల్లయ్య, ఉప్పరి కొండలు,ముత్యాల కేశవులు, కోటయ్య, వెంకన్న, తదితరులు ,పాల్గొన్నారు.