సింగరేణిని ప్రైవేటీకరణ చేసేందుకు మోడీ ప్రభుత్వం కుట్రలు

Submitted by Srikanthgali on Mon, 05/12/2022 - 15:16
Modi government plots to privatize Singareni

సింగరేణిని ప్రైవేటీకరణ చేసేందుకు మోడీ ప్రభుత్వం కుట్రలు

ప్రధాని నరేంద్ర మోడీ దిష్టిబొమ్మ దహనం

నిరసన కార్యక్రమాన్ని చేపట్టిన జిల్లా ఐఎన్టీయూసీ, కాంగ్రెస్ కార్యకర్తలు

కొత్తగూడెం క్రైమ్, డిసెంబర్ 05, ప్రజాజ్యోతి:

సింగరేణిని ప్రైవేటీకరణ చేసేందుకు కేంద్రంలోని మోడీ ప్రభుత్వం కుట్రలు చేస్తుందని కేంద్ర ప్రభుత్వం సింగరేణికి సంబంధించిన నాలుగు బొగ్గు బ్లాక్ లను వేలం వేయడాన్ని నిరసిస్తూ కొత్తగూడెం రైల్వే స్టేషన్ సమీపంలో గల ఐఎన్టియుసి కార్యాలయం వద్ద ఐఎన్టీయూసీ ప్రతినిధి డాక్టర్ సంజీవరెడ్డి, సెక్రటరీ జనరల్ ప్రసాద్ ఆదేశాల మేరకు రైల్వే స్టేషన్ ప్రధాన చౌరస్తాలో జిల్లా ఐఎన్టియుసి, కాంగ్రెస్ నాయకులు ప్రధాని నరేంద్ర మోడీ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రామగుండంలో జరిగిన సభ సందర్భంగా ప్రధాని మోడీ సింగరేణి విషయంలో ఇచ్చిన మాటను తప్పారు అన్నారు. సింగరేణికి సంబంధించిన నాలుగు బహులను ప్రైవేటీకరించడం మోడీ నిరంకుశ పాలనకు చిహ్నంగా ఉందన్నారు. ఒకవైపు ప్రైవేటీకరణ చేయడం లేదంటూ కార్మికులకు అబద్ధపు వాగ్దానాలు చేస్తూ కార్మికులను మభ్యపెడుతున్నారు అన్నారు. మోడీ సర్కార్ కు కళ్లెం వేయాలంటే సింగరేణి కార్మిక వర్గం కేంద్రంలో మోడీ సర్కారును తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. తెలంగాణలో ఉన్న బొగ్గు బాయిలను కేంద్ర ప్రభుత్వం మళ్ళి వేలంపాట వ్యతిరేఖించండి అంటూ కార్మికులకు కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఎన్ని పొరాటలు చేసిన వెనక్కి తగ్గని మోడి సర్కార్ను తిప్పికొట్టండి అన్నారు. ఎంఎండిఆర్ బిల్లుకు తెరాస సహకరించడాన్ని ఖండిస్తున్నాం అన్నారు. కేంద్ర ప్రభుత్వ మొండి వైఖరి నశించాలి. ఖబడ్డార్ మోడి ఖబడ్డార్ అంటూ నినాదాలు చేసుకుంటూ నిరసన తెలిపారు.ఈ కార్యక్రమం కొత్తగూడెం జిల్లా టిపిసిసి సభ్యులు ఎడవల్లి కృష్ణ, ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షుడు ఎస్ ఏ జలీల్, ఐఎన్టియుసి కోల్ మైన్స్ జిల్లా అధ్యక్షుడు త్యాగరాజు, ఉపాధ్యక్షుడు కేడేం ఆల్బర్ట్, డాక్టర్ శంకర్ నాయక్, రాజేశ్వరరావు, సైమన్, కాలం నాగభూషణం, లక్ష్మణరావు, సునీల్, కుమార్, రాజేష్, తదితరులు పాల్గొన్నారు.