తుంగతుర్తి పై చవతి తల్లి ప్రేమ చూపిస్తున్న ఎమ్మెల్యే మల్లెపాక సాయిబాబా

Submitted by Yellaia kondag… on Tue, 27/09/2022 - 16:07
MLA showing motherly love to Tungaturthi  Jasmine Saibaba

తుంగతుర్తి, సెప్టెంబర్ 27 (ప్రజా జ్యోతి):   నాడు ఎన్నికల ముందు తుంగతుర్తి నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని హామీలు ఇచ్చిన ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ నేడు తుంగతుర్తి నియోజకవర్గాన్ని ఏ మాత్రం కూడా అభివృద్ధి చేయకుండా అవినీతి అక్రమాలకు పాల్పడుతూ  నియోజకవర్గ కేంద్రమైనటువంటి తుంగతుర్తిపై  సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నారని బిజెపి సూర్యాపేట జిల్లా ప్రధాన కార్యదర్శి మల్లేపాక సాయిబాబు అన్నారు. మంగళవారం తుంగర్తి మండల కేంద్రంలోని సూర్యపేట తుంగతుర్తి ప్రధాన రహదారిని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... నియోజకవర్గాన్ని అభివృద్ది చేయడం మరిచి మునుగోడు లో ఏ మొకం పెట్టుకొని ప్రచారానికి వెళ్ళారని  ప్రశ్నించారు. గత మూడు సంవత్సరాలుగా తుంగతుర్తి నుండి జిల్లా కేంద్రమైనటువంటి సూర్యాపేటకు వెళ్లే ప్రధాన రహదారి గుంతల మయమై  ఎప్పుడు కులుతుందో తెలియని పరిస్థితి ఏర్పడ్డదని ఆవేదన వ్యక్తం చేశారు.

వర్షాలు  వస్తే ఆ దారి నుండి నియోజకవర్గ కేంద్రానికి విద్యా,వైద్యం కొరకు వచ్చే వారు ప్రాణాలు అరిచేతుల్లో పెట్టుకొని రావాల్సిన పరిస్థితి ఏర్పడ్డదని అన్నారు.అలాగే ఎమ్మెల్యే  చేసే అభివృద్ధిని బిజెపి నాయకులు అడ్డుకుంటున్నారని  విమర్శించే  తెరాస నాయకుల్లారా ఇదేనా మీ ఎమ్మెల్యే చేసే అభివృద్ధి అని ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ స్పందించి ఈ యొక్క రహదారిపై బ్రిడ్జి నిర్మించాలని కోరారు. ఈ కార్యక్రమం లో బిజెపి మండల అధ్యక్షులు గాజుల మహేందర్ , బిజేవైఎం తుంగతుర్తి మండల అధ్యక్షులు నారాయణదాసు నాగరాజు , జిల్లా నాయకులు బండి నవీన్, నాయకులు కొండ వెంకన్న, గుండాల సైదులు, మెంతబోయిన గణేష్, కొండ అజిత్, జక్కి కాశి, మరిపెల్లి నరేందర్, లోకేష్, సతీష్, తదితరులు పాల్గొన్నారు