ప్రమాదవశాత్తు మరణించిన టీఆర్ఎస్ కార్యకర్త కుటుంబ సభ్యులకు బీమా చెక్కు లను అందజేసిన: ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి

Submitted by Paramesh on Thu, 29/09/2022 - 16:30
MLA Sanampudi Saidireddy handed over insurance checks to the family members of the TRS worker who died in an accident.

నేరేడుచర్ల, సెప్టెంబర్ 29(ప్రజాజ్యోతి):   నేరేడుచర్ల మండల పరిధిలోని దిర్శించర్ల గ్రామానికి చెందిన తెరాస కార్యకర్త పార్టీలో కార్యకర్త గా ఉంటూ ప్రమాదవశాత్తు మృత్యువాత పడిన గుండెబోయిన సతీష్  కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి గురువారం రెండు లక్షల రూపాయల విలువ గల చెక్కును అందజేశారు.ఈ సందర్బంగా సైదిరెడ్డీ మాట్లాడుతూ ప్రతీ కార్యకర్త ఇంటికి కేసీఆర్ పెద్ద దిక్కులా ఉంటారని స్పష్టం చేశారు. పార్టీ కి కార్యకర్తలే పునాది అని కార్యకర్తల కొసం టీఆర్ఎస్ పార్టీ 18 కోట్ల రూపాయలను ఇన్సూరెన్స్ గా చెల్లిస్తుందన్నారు. కార్యకర్తలకు  బీమా సౌకర్యం కల్పించడం ద్వారా వాళ్ళ ఇంటికి పెద్ద దిక్కులా  ముఖ్యమంత్రి కేసీఆర్ నిలుస్తుండన్నారు.గ్రామా స్థాయి నుంచి పార్టీని పటిష్టపర్చడంలో కార్యకర్తల పాత్ర క్రియాశీలకమైందన్నారు.టీఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వం పేదల అభివృద్ధికి ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తుంది అని ఆయన అన్నారు. ప్రభుత్వ పథకాలు అర్హులకు అందేలా పార్టీ కార్యకర్తలు బాధ్యత తీసుకోవాలని కోరారు. కార్యకర్తలు టీఆర్ఎస్ పార్టీ ప్రవేశ పెట్టిన ప్రమాద బీమా పథకం లో సభ్యత్వం తీసుకోవాలని ఆయన అన్నారు.పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త పని చేయాలనీ సూచించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు అరిబండి సురేష్ బాబు మాజీ మండల పార్టీ అద్యక్షుడు సోమిరెడ్డి నేరేడు చర్ల టౌన్ పార్టీ అధ్యక్షురాలు & మున్సిపల్ వైస్ చైర్మన్ చల్లా శ్రీలత రెడ్డి తెరాస మండల అదికార ప్రతినిధి& పీ ఏ సి ఎస్ ఛైర్మెన్ అనంతు శ్రీనువాస్ గౌడ్ రమేష్ పెంచికల్ దీన్న ఎంపిటిసి లింగయ్య గ్రంధాలయ ఛైర్మెన్ మార్కండేయ తెరాస కార్యకర్తలు అభిమానులు తదితర్లు పాల్గొన్నారు