సీఎం కెసిఆర్ కు ధన్యవాదములు తెలిపిన ఎమ్మెల్యే రాజయ్య

Submitted by bosusambashivaraju on Fri, 30/09/2022 - 15:10
MLA Rajaiah thanked CM KCR
  • -స్టేషన్ ఘనపూర్ లో రీనల్ డయాలసిస్ సెంటర్ మంజూరి చేసిన సీఎం 
  • - నియోజకవర్గ కేంద్రంలోని ఉన్నతశ్రేణి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నూతన రినల్ డయాలసిస్ సెంటర్ ఏర్పాటు
  • - గదులు, మౌలిక సదుపాయాలను పరిశీలించిన ఎమ్మెల్యే 

స్టేషన్ ఘనపూర్, సెప్టెంబర్ 30 ( ప్రజాజ్యోతి ) : -    స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గానికి రీనల్ డయాలసిస్ సెంటర్ మంజూరి అయినందున శుక్రవారం  నియోజకవర్గ కేంద్రంలోని ఉన్నత శ్రేణి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రీనల్ డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేయుటకు గదులను, మౌలిక సదుపాయాలను  ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య  వైద్య అధికారులతో కలిసి క్షేత్ర స్థాయిలో పరిశీలించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే  మాట్లాడుతూ సీఎం కేసీఆర్  ఆశీస్సులతో వైద్య ఆరోగ్య శాఖా మంత్రి హరీష్ రావు  చొరవతో స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గానికి 5 పడకల డయాలసిస్ సెంటర్ మంజూరు అయ్యిందని ఎమ్మెల్యే  తెలిపారు. సీఎం కెసిఆర్, ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు లకు ఎమ్మెల్యే రాజయ్య ధన్యవాదాలు తెలిపారు. డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చెయ్యాలంటే 1000 చదరపు గజాల భూమి , గదులు, సరైన మౌలిక సదుపాయాలు ఉండాలని సూచించారు. రీనల్ డయాలసిస్ ఒక్కసారి చెయ్యాలంటే 5000 /- లు ఖర్చు అవుతుంది. ఆ ఖర్చులు సైతం పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తూ కిడ్నీ ఫెయిల్యూర్ డయాలసిస్ చేయుటకు ఆరోగ్యశ్రీ లో చేర్చబడినదని అన్నారు .ఈ డయాలసిస్ సెంటర్ లో ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా వారానికి ఒక్కసారి , 15 రోజులకు ఒక్కసారి చొప్పున రీనల్ ఫెయిల్యూర్ డయాలసిస్ చేయబడును అన్నారు . స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గానికి చెందిన దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధి గ్రస్తులు డయాలసిస్ కోసం జనగామ , వరంగల్,  హైదరాబాద్ కు వెళ్లకుండా ఇక్కడే చేసుకునే సదుపాయాలు కల్పించడం జరుగుతోందని తెలిపారు.రీనల్ డయాలసిస్ కోసం కిడ్నీ వ్యాధిగ్రస్తులకు 2016 /- రూపాయలు ప్రతి నెలకు పింఛన్ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ మారపాక రవి, ఎంపీపీ కందుల రేఖ, మండల అధ్యక్షుడు, డాక్టర్ శ్రీవాణి, అందుబాటులో ఉన్న ప్రజా ప్రతినిధులు , ముఖ్య నాయకులు , వైద్య అధికారులు , వైద్య సిబ్బంది,  పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.