బతుకమ్మ చీరలు, ఆసరా పెన్షన్ కార్డులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే ,జడ్పీ చైర్మన్

Submitted by bosusambashivaraju on Sun, 25/09/2022 - 14:18
MLA and ZP Chairman who distributed Bathukamma Sarees and Asara Pension Cards

స్టేషన్ ఘనపూర్ (చిల్పూర్)  సెప్టెంబర్ 24, ప్రజాజ్యోతి : -   తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బడుగు బలహీన వర్గాల ప్రజలకు  అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అన్ని విధాలుగా ఆదుకుంటున్నారని తెలంగాణ తొలి ఉప ముఖ్యమంత్రి ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య, జనగాం జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, జెడ్పి చైర్మన్ పాగాల సంపత్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా శనివారం చిల్పూర్ మండలం కృష్ణాజి గూడెం గ్రామంలో సర్పంచ్ పుట్ట అంజలి దేవి రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో బతుకమ్మ చీరలు, నూతన పించన్ కార్డులు, కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ  కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే రాజయ్య, జెడ్పీ చైర్మన సంపత్ రెడ్డిలు పంపిణీ చేశారు.అనంతరం ముఖ్యమంత్రికెసిఆర్ చిత్రపటానికి కృతజ్ఞతగా పాలాభిషేకం చేశారు.ఇందులో భాగంగా క్రిష్ణాజిగూడెం  గ్రామ సర్పంచ్ పుట్ట అంజలీదేవి రవీందర్ రెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన బతుకమ్మ చీరలు, వృద్ధులకు పింఛన్లు కార్డులు, కళ్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ కార్యక్రమ సమావేశంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న ఎమ్మెల్యే రాజయ్య జడ్పీ చైర్మన్ చైర్మన్ పాగాల సంపత్ రెడ్డి లు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి  కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రతి ఒక ఆడపడుచుకు దసరా పండుగ నాడు కొత్త చీర కట్టుకుని బతుకమ్మ అడాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్క మహిళను, అక్కా చెల్లెళ్ళుగా భావించి ఈ  చీరలను పంపిణి చేసే ఈ బృహత్తరమైన  కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని అన్నారు. అలాగే ఈ కార్యక్రమం ద్వారా ప్రభుత్వం చేనేత కార్మికులకు ఉపాధి కల్పించిందని,  టిఆర్ఎస్ ప్రభుత్వం అన్ని మతాలను గౌరవిస్తున్నదని , అందరం ముఖ్యమంత్రి కేసీఆర్ కు రుణపడి ఉండాలని కోరారు.

ఏ రాష్ట్రంలో లేని అభివృద్ది మన రాష్ట్రంలో జరుగుతున్నదని, ప్రతి పేద కుటుంబం సుఖ సంతోషాలతో ఉండాలన్నదే ముఖ్యమంత్రి  ఆశయం అని అన్నారు. ఈ దసరా పండుగ సందర్భంగా మన తెలంగాణ రాష్ట్రంలో సుమారు 30రకాల వెరైటీలు, 240 డిజైన్లు, 800 కలర్ కాంబినేషన్ లతో రాష్ట్ర వ్యాప్తంగా చీరల పంపిణి కార్యక్రమం చేపట్టారని వారు తెలిపారు. అనంతరం చిల్పూర్ మండలంలోని అన్ని గ్రామాల్లో జెడ్పీ నిధుల ద్వారా మంజూరైన 20 లక్షల రూపాయలతో హైమక్స్ లైట్స్ ఏర్పాటు చేస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎంపిపి  బొమ్మిశెట్టి సరిత బాలరాజు, చిల్పుర్ దేవస్థాన కమిటీ చైర్మన్ పొట్లపల్లి శ్రీధర్ రావు, మండల పార్టీ అధ్యక్షులు రమేష్ నాయక్, యంపిటిసి సాదం నర్సింలు పిఎసిఎస్ చైర్మన్ నాగరాజు, ఉపసర్పంచ్ సాదం రవి, గ్రామ శాఖ అధ్యక్షులు రాజన్న, నియోజకవర్గ సోషల్ మీడియా ఇంచార్జ్ రంగు రమేష్, మార్కెట్ డైరెక్టర్లు బత్తుల రాజన్ బాబు, రంగు హరీష్, నియోజకవర్గ నాయకులు వెంకట్ స్వామి, మహిళ నాయకురాలు రజిత, ఇతర ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.