జాతీయ స్ధాయిలో అర్హత సాధించిన మారియాకు మంత్రి పువ్వాడ అభినందనలు.

Submitted by Praneeth Kumar on Sun, 11/09/2022 - 21:05
Minister Puvwada congratulated Maria for qualifying at the national level.

ఖమ్మం అర్బన్, సెప్టెంబర్ 11, ప్రజాజ్యోతి:

ప్రముఖ రేనౌండ్ 10 మీటర్స్ ఎయిర్ రైఫిల్ షూటింగ్ లో జాతీయ స్థాయి పోటీల్లో అర్హత సాధించి, ఇండియా తరుపున ట్రైల్స్ లో పాల్గొంటున్న ఖమ్మం జిల్లా కేంద్రంకు చెందిన ఎండి మారియా,10 మీటర్స్ ఎయిర్ పిస్తోల్ షూటింగ్ లో రాష్ట్ర స్థాయి కాంస్య పతక సాధించిన విజేత తన సోదరుడు మహ్మద్ ఎహెసాన్ లను రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రత్యేకంగా అభినందించారు. రైఫిల్ పిస్తోల్ షూటింగ్ క్రీడలలో ఖమ్మం జిల్లా కేంద్రం నుండి క్రీడాకారులు జాతీయ స్థాయిలో ప్రతినిధ్యం వహించడం హర్షనీయమని మంత్రి పువ్వాడ అజయ్ అన్నారు. మారియా తప్పక అంతర్జాతీయ స్థాయికి ఎదుగుతారని ఆకాంక్షించారు. స్పోర్ట్స్ డైరెక్టర్ తో మాట్లాడి తప్పక ప్రభుత్వం తరపున సహాయం అందిస్తానని హామీ ఇచ్చారు. ఖమ్మం జిల్లా కీర్తి ప్రతిష్టలు అంతర్జాతీయ స్ధాయిలో వెలుగొందేలా భవిష్యత్తులో రైఫిల్ షూటర్ మారియా, పిస్తోల్ షూటర్ ఎహెసాన్ మరిన్ని ఉన్నతమైన పతకాలు సాధించాలని మంత్రి పువ్వాడ దీవెనలు అందించారు. మేయర్ పునుకొల్లు నీరజ, హజ్ బోర్డ్ రాష్ట్ర కమిటీ సభ్యులు, తెరాసా కార్పొరేటర్ షేక్ మక్బూల్, సిటి సెంట్రల్ లైబ్రరీ చైర్మెన్ మహమ్మద్ అశ్రిఫ్, తెరాసా మైనారిటి జిల్లా అధ్యక్షులు తాజుద్దీన్, మైనార్టీ నగర అధ్యక్షులు శంషుద్దీన్, తెరాసా నగర ప్రచార కార్యదర్శి షకీనా లు అభినందనలు తెలిపారు. ఖమ్మం నగర వాసులైన రైఫిల్ షూటర్ మారియా, ఎహెసాన్ లు ఉన్నత చదువుల, షూటింగ్ శిక్షణ నిమిత్తం హైదరాబాద్ నగరంలో ఉంటూ తన కుటుంబసభ్యుల ప్రోత్సాహంతో తమ ప్రతిభను కనబరుస్తూ ఇప్పటికే అనేక  రాష్ట్రస్థాయి పతకాలు సాధించి జాతీయ స్థాయి షూటింగ్ పోటీలకు సిద్ధమౌతున్నారని ఖమ్మం జిల్లా మైనారిటీ నాయకుల సహకారం ఎల్లప్పుడూ ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో సోదరులు జర్నలిస్ట్ జానిపాషా, క్రీడాకారుల తండ్రి ఖదీర్ తదితరులు పాల్గొన్నారు.