కనీస వేతనాల జీవోలు సవరించాలి కార్మిక సంఘాల ధర్నా

Submitted by Sathish Kammampati on Tue, 27/09/2022 - 15:48
Minimum wages should be revised    Dharna of labor unions

నల్లగొండ సెప్టెంబర్ 26(ప్రజాజ్యోతి).//..రాష్ట్రంలో షెడ్యూల్డ్ ఎంప్లాయిమెంట్స్ లో కనీస వేతనాల జీవోలను సవరించి కనీస వేతనం 26,000 ఉండేవిధంగా నిర్ణయించి అమలు చేయాలని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు తుమ్మల వీరారెడ్డి ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి పల్లా దేవేందర్ రెడ్డి ఐ ఎన్ టి యు సి జిల్లా నాయకులు కే నరసింహారెడ్డి ఐ ఎఫ్ టి యు జిల్లా కార్యదర్శి బొమ్మిడి నగేష్ లు డిమాండ్ చేశారు.సోమవారం తెలంగాణ కేంద్ర, రాష్ట్ర కార్మిక సంఘాల పిలుపుమేరకు నల్లగొండ జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నా చేసి జాయింట్ కలెక్టర్ కు వినతి పత్రం సమర్పించడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో షెడ్యూల్డ్ ఎంప్లాయిమెంట్స్ లో కనీస వేతనాలు ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి సవరించబడాలి. కానీ తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన అనంతరం సవరణలు జరగలేదు వివిధ రంగాల కార్మికుల కనీస వేతనాలు పెరగలేదు పెరుగుతున్న నిత్యవసర వస్తువుల ధరలు ఇంటి అద్దెలు, విద్యా వైద్య ఖర్చులు పెరిగి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 73 షెడ్యూల్ ఎంప్లాయిమెంట్స్ లో కనీస వేతనాలు సవరించాలని కోరుతున్నాం. ఫైనల్ నోటిఫికేషన్ ఇచ్చిన వాటికి గెజిట్ ఇవ్వాలని కార్మిక సంఘాలు రాష్ట్ర ప్రభుత్వానికి అనేక మార్లు విజ్ఞప్తి చేసిన పెడచెవినపెడుతుందని ఆరోపించారు.

తక్షణమే కనీస వేతనాల జీవోలు సవరించి 15వ ఐ ఎల్ సి తీర్మానం, డాక్టర్ ఆత్రాయుడు ఫార్ములా, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఆధారంగా కనీస వేతనాలు నిర్ణయించాలని డిమాండ్ చేశారు.ప్రస్తుత ధరలకు అనుగుణంగా ప్రతి కార్మికుడికి కనీస వేతనం 26000 నిర్ణయించి అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నాలో  సిఐటియు జిల్లా అధ్యక్షులు చినపాక లక్ష్మీనారాయణ సిఐటియు ఎఐటియుసి, ఐ ఎన్ టి యు సి ఐఎఫ్టియు వివిధ రాష్ట్ర, కేంద్ర కార్మిక సంఘాల నాయకులు డబ్బికారు మల్లేష్ ,ఎండి సలీం, దొనకొండ వెంకటేశ్వర్లు, అవుత సైదులు, దండెంపల్లి సత్తయ్య, నారబోయిన శ్రీనివాస్, నల్ల వెంకటయ్య,లెనిన్ బాబు, తిరుపతి రామ్మూర్తి, రొండి శ్రీనివాస్, అద్దంకి నరసింహ, పోలే సత్యనారాయణ,భీమగాని గణేష్, పెండెం రాములు,ఎల్లయ్య,మన్నే శంకర్  తదితరులు పాల్గొన్నారు.