గిరిజనుల భారీ ర్యాలీ.

Submitted by veerareddy on Tue, 20/09/2022 - 12:34
Massive rally of tribals.

ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజన చట్టాలు పటిష్టంగా అమలు చేయాలని డిమాండ్. 
వెంకటాపురం (నూగూరు) సెప్టెంబర్ 19 (ప్రజా జ్యోతి)''// ఏజెన్సీ లో గిరిజన చట్టాలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఆదివాసీ నవనిర్మాణ సేన గిరిజన సంఘం ఆధ్వర్యంలో వెంకటాపురం మండల కేంద్రంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 28 వ రోజుకు చేరుకున్నాయి.దీక్షలకు మద్దతుగా గిరిజనులు సోమవారంభారీ ర్యాలీ నిర్వహించారు.ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్న గిరిజనేతరులు ఇక్కడ నుంచి వెళ్ళి పోవాలని, 1/70 చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని, పెసా చట్టం అమలు కోసం పాటుపడని ఎమ్మెల్యే, జడ్పీటీసీ, ఎంపీపీ తమ పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ ర్యాలీలో నినాదాలు చేశారు.ఏజెన్సీ ప్రాంతాల్లో ఆదివాసీ చట్టాలు అమలు చేయకపోతే ఆదివాసీ వనదేవతల స్ఫూర్తితో ఉద్యమిస్తామని హెచ్చరించారుఆదివాసీ చట్టాల అమలు కోసం ఆదివాసీ నవనిర్మాణ సేన వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడు కొర్శా. నర్సింహమూర్తి చేపట్టిన రిలే నిరాహార దీక్షలకు సంఘీభావంగా మహిళలు సంఘీభావం తెలిపారు
చట్టాల అమలు కోసం ప్రాణ త్యాగాలకు సిద్ధంగా ఉన్నట్లు కొర్శా. నర్సింహమూర్తి ప్రకటించారు