మల మహానాడు నూతన కమిటీ ఏకగ్రీవ ఎన్నిక

Submitted by veerareddy on Mon, 03/10/2022 - 14:42
Mala Mahanadu new committee unanimously elected

 పెన్పహాడ్ మండలం అక్టోబర్ 02 (ప్రజా జ్యోతి):  మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు  జి చెన్నయ్య ఆదేశాల మేరకు జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ మేక వెంకన్న సూచన మేరకు మాల మహానాడు సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు ఆశోద రవి,జిల్లా మహిళా అధ్యక్షురాలు పిట్టల భాగ్యమ్మ ఆధ్వర్యంలో  పెన్ పహాడ్ మండల కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగినది మండల అధ్యక్షుడిగా తుమ్మకొమ్మ విజయ్ ,మండల ప్రధాన కార్యదర్శిగా కంచి ప్రవీణ్ , జిల్లా కార్యదర్శిగా బొల్లెద్దు వినోద్,మండల మహిళా అధ్యక్షురాలుగా రాయి నవ్య,మండల ఉపాధ్యక్షుడు వరకాల విజయ్ కుమార్,మండల కార్యదర్శిగా గొబ్బి రమేష్ , మండల కోశాధికారిగా పేరం మధు , మహిళా కార్యదర్శిగా బాదే నవ్య , మండల కార్యవర్గ సభ్యులుగా జెక్కి రాంబాబు, పరకాల నవీన్ ,  జక్కి వంశీ , శేఖర్ ప్రవీణ్ కుమార్ లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఈ కార్యక్రమంలో జిల్లా గౌరవ సలహాదారుడు నామ నాగయ్య  జిల్లా ప్రధాన కార్యదర్శి కట్ల మురళి జిల్లా కార్యదర్శి బొప్పని అనిల్  జిల్లా కార్యదర్శి అభిమల్ల భీష్మ తదితరులు పాల్గొన్నారు.