మట్టి విగ్రహాలనే వాడుదాం పర్యావరణాన్ని కాపాడుకుందాం.

Submitted by Ashok Kumar on Thu, 01/09/2022 - 13:31
Let's use clay idols and save the environment.

◆ మట్టి గణపతినే పూజిద్దాం రంగు విగ్రహాలు మానేద్దాం
◆ మట్టి గణపతి కీ పూజలు చేసిన గద్వాల ఎమ్మెల్యే

గద్వాల జిల్లా (ప్రజాజ్యోతి ప్రతినిది) ఆగస్టు 31 :బుధవారం గద్వాల జిల్లా కేంద్రంలోని వినాయక చవితి పర్వదినం సందర్బంగా 28వ వార్డ్ శేరెల్లివీధి నందు బి ఎస్ కె యూత్ ఆధ్వర్వంలో ఏర్పాటు చేసిన మట్టి గణపతి కీ గద్వాల ఎమ్మెల్యే  బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి,మున్సిపల్ చైర్మన్ బి.యస్.కేశవ్, ప్రజాప్రతినిధులు ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు.స్వామి వారి తీర్థ ప్రసాదాలు తీసుకొన్ని వినాయకుని ఆశీస్సులు పొందడం జరిగింది.
అనంతరం గద్వాల ఎమ్మెల్యే కీ చైర్మన్ కేశవ్ స్వామి వారి శేష వస్త్రంతో ఘనంగా సత్కరించడం జరిగింది.
గద్వాల ఎమ్మెల్యే మాట్లాడుతూ
వినాయక చవితి పర్వదినం సందర్బంగా గద్వాల పట్టణ ప్రజలందరికి వినాయక చవితి శుభాకాంక్షలు. గద్వాల నియోజకవర్గం ప్రజలు అందరూ ఇంట్లోనే మట్టి వినాయకుని ప్రతిష్టించి అత్యంత భక్తి శ్రద్ధలతో పండగను జరుపుకోవాలన్నారు. ప్రతి ఒక్కరూ మట్టి విగ్రహాలను పూజించటం ద్వారా నీటి కాలుష్యాన్ని నిర్ములించటంతో పాటు పర్యావరణ పరిరక్షణలో భాగ్యస్వాములు కావాలన్నారు.
మట్టి గణపతుల వల్ల పర్యావరణానికి ఎలాంటి ముప్పు హాని ఉండదని అన్నారు. ప్లాస్టర్ అఫ్ పారిస్ తో తయారు చేసిన గణపతులను వాడటం కారణంగా వాతావరణం కాలుష్యం ఏర్పడటమే కాకుండా జల కాలుష్యం వాయు కాలుష్యం ఏర్పడుతుందని అన్నారు. అందువల్ల ప్రజలందరూ వినాయక చవితి సందర్బంగా పూజించే వినాయకులను మట్టితో తయారు చేసిన గణపతులను మాత్రమే వాడాలని గద్వాల ఎమ్మెల్యే గారు పిలుపునిచ్చారు. అందరికి సకల విఘ్నాలు తొలగించి సుఖ సంతోషాలతో అష్ట ఐశర్వాల్యతో ప్రజలందరిపై ఆ గణనాధుని ఆశీస్సులు ఎల్లప్పుడు ఉండాలని భగవంతుడుని మనస్ఫూర్తిగా కోరుకున్నట్లు గద్వాల ఎమ్మెల్యే తెలిపారు.
ఈ కార్యక్రమంలో  ప్రజాప్రతినిధులు,వైస్ చైర్మన్,మున్సిపల్ కౌన్సిలర్స్ కో అప్షన్ మెంబెర్స్,జములమ్మ ఆలయ కమిటీ చైర్మన్,డైరెక్టర్స్,గద్వాల్ పట్టణ అధ్యక్షులు, కార్యవర్గం టౌన్ యూత్ అధ్యక్షులు కార్యవర్గం తెరాస పార్టీ నాయకులు బి ఎస్ కె  యూత్ సభ్యులు మరియు భక్తులు తదితరులు పాల్గొన్నారు.