బంగారు తెలంగాణ అని చెప్పి మద్యం తెలంగాణ గా మార్చిన నాయకుడు కేసీఆర్

Submitted by sridhar on Tue, 06/09/2022 - 10:51
KCR is the leader who changed liquor to Telangana by calling it golden Telangana
  • వైయస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల
  • కల్వకుర్తిలోప్రజా ప్రస్థానం పాదయాత్రలో వైఎస్ షర్మిల భారీ బహిరంగ సభ
  • వైయస్సార్ బిడ్డను దీవించండి వైఎస్ఆర్ సంక్షేమ పాలన తిరిగి తీసుకు వస్తా
  • సభ అనంతరం భారీ వర్షంలో పాదయాత్ర కొనసాగించిన వైయస్ షర్మిల

కల్వకుర్తి సెప్టెంబర్ 5 ప్రజా జ్యోతి ;  బంగారు తెలంగాణ అని చెప్పి మద్యం తెలంగాణగా మార్చిన వ్యక్తి కెసిఆర్ అని వైయస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల అన్నారు ప్రజా ప్రస్థానం పాదయాత్రలో భాగంగా కల్వకుర్తి వైఎస్ఆర్ టీపీ కోఆర్డినేటర్ చీమర్ల అర్జున్ రెడ్డి ఆధ్వర్యంలో కల్వకుర్తి పట్టణంలో వైయస్సార్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు  ప్రజలను ఉద్దేశించి షర్మిల మాట్లాడుతూ కెసిఆర్ ఎనిమిదేళ్ల కాలంలో మోసం చేయని వర్గం లేదు ఇంటికో ఉద్యోగం అని నిరుద్యోగులను మోసం చేశారు వైయస్సార్ బ్రతికి ఉంటే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి చేసేవారు కల్వకుర్తి నెట్టెంపాడు బీమా లాంటి పథకాలు కట్టి లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చిన ఘనత రాజశేఖర్ రెడ్డి అన్నారు.

కల్వకుర్తి నియోజకవర్గానికి 70 వేల ఎకరాలకు నీళ్లు పారుతున్నాయి అంటే వైయస్సార్ ఘనత కళ్ళ ముందు రెండు లక్షల ఉద్యోగాలు కనిపిస్తుంటే కేసీఆర్ సోమేమైనా పోతుందా ఊరించి ఊరించి 17వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చారు బంగారు తెలంగాణ నేమో మద్యం తెలంగాణ గా మార్చిన ఘనత కేసిఆర్ కే దక్కుతుందన్నారు మీ స్థానిక ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ కంటికి మాత్రం అమాయకుడు కానీ ఎవరికీ తెలియకుండా వందల కోట్లు సంపాదించిన ఘనుడు మీ ఎమ్మెల్యే పేదల భూములు లాక్కొని రియల్ ఎస్టేట్ దందా చేస్తున్నారు ఆయన సొంత గ్రామంలో డబల్ బెడ్ రూమ్ ఇండ్లకు శంకుస్థాపన చేసి ఏళ్ళు గడుస్తున్న తట్టెడు మట్టి తీయలేదని ఆమె పేర్కొన్నారు ఒకసారి మీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ కి ఓడగొట్టి బయటికి పంపండి ప్రజలకు పిలుపునిచ్చారు.

బంగారు తెలంగాణ అని చెప్పి 16 వేల కోట్లు మిగులు బడ్జెట్ రాష్ట్రాన్ని నాలుగు లక్షల కోట్లు అప్పుల పాలు చేసిన ఘనత కేసీఆర్ అన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి రాష్ట్ర అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేసిన వ్యక్తిగా నిరంతరం ప్రజా సంక్షేమం కోసమే పనిచేసిన మహా నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని ఆమె పేర్కొన్నారు రాజశేఖర్ రెడ్డి బిడ్డగా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేసేందుకు కంకణ భక్తురాలుగా సైనికురాలుగా పనిచేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానని మీరు ఆశీర్వదిస్తే ప్రజల కోసం పనిచేస్తానని వైఎస్ షర్మిల పేర్కొన్నారు అదేవిధంగా రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టిన ఘనత ఆయనకే దక్కుతుంది అన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు పుట్టా శేఖర్, తిరుపతి ముదిరాజ్, పెద్ద ఎత్తున వైయస్సార్ టిపి నాయకులు కార్యకర్తలు మహిళలు పాల్గొన్నారు