మాట ఇచ్చి తప్పడం కెసిఆర్ కు అలవాటే

Submitted by veerareddy on Thu, 29/09/2022 - 09:48
KCR has a habit of breaking his promises
  • గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్ జీవ ఇవ్వకుంటే ఉద్యమం తప్పదు 
  • అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేసిన
  •  ఎల్ హెచ్ పి ఎస్ రాష్ట్ర  ప్రధాన కార్యదర్శి గుగులోతు భీమా నాయక్

 మహబూబాబాద్ బ్యూరో   సెప్టెంబర్ 28 (ప్రజా జ్యోతి):  మాట ఇచ్చి తప్పడం ముఖ్యమంత్రి కేసీఆర్ కు అలవాటేనని గిరిజనులకు ఇస్తానన్న 10% రిజర్వేషన్ జీవో ను వెంటనే విడుదల చేయకపోతే ఉద్యమం తప్పదని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎల్ హెచ్ పి ఎస్ రాష్ట్ర  ప్రధాన కార్యదర్శి గుగులోతు భీమా నాయక్ డిమాండ్ చేశారు. 10 శాతం రిజర్వేషన్ గిరిజనులకు అమలు చేస్తానని హామీ ఇచ్చారు తక్షణమే అమలు చేయాలని  ఎల్ హెచ్ పి ఎస్ అధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్బంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భీమా నాయక్ మాట్లాడుతూ రిజర్వేషన్ అమలు చేయకుండానే రాష్ట్రంలో కొన్ని ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు, గిరిజనులకు తీరని అన్యాయం జరుగుతుంది. తక్షణమే 10 శాతం రిజర్వేషన్ పై ప్రత్యేకంగా జీవో తీసుకురావాలని ,భారత రాజ్యాంగం ప్రకారం మా వాటా మాకు ఇవ్వాల్సిందేనని మీరు కష్టపడి రాజ్యాంగాన్ని రచించారు ,కానీ కెసిఆర్ ప్రతి ఎన్నికల సభలలో 12 శాతం రిజర్వేషన్ గిరిజనులకు తప్పకుండా అమలు చేస్తానని మాట ఇచ్చారు, మాట తప్పారు ఇప్పటికే ఇంజనీరింగ్ మెడిసిన్ డిప్లమా అన్ని రంగాల ఉద్యోగాల్లో ఆరు శాతంతోనే ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు తీరని అన్యాయం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్లో రెండు శాతం ఉన్న గిరిజనులు అక్కడ ఆరు శాతం అమలవుతుంది. ఇక్కడ 10 శాతం ఉంటే ఆరు శాతం మాత్రమే అమలవుతుంది ఎంత నష్టం జరుగుతుందో అర్థం చేసుకోండి గిరిజన ప్రజాప్రతినిధుల్లారా మన జాతికి బిడ్డలకు ఘోరంగా నష్టపోతున్నారు తక్షణమే అమలయేటట్టు అడగండి ప్రశ్నించండి నిలదీయండి .

మీ వెంట గిరిజన జాతి ఉంటుంది ప్రశ్నించకపోతే నిలదీయకపోతే జాతి ద్రోహులుగా మిగులుతారు మీ స్వార్ధాలు చూసుకోకండి పిల్లల భవిష్యత్తును చూడండి ఎన్టీఆర్ నాలుగు శాతం నుండి 6% పెంచినట్టే కేసీఆర్  10 శాతం పెంచాల్సిందేనని జీవో తీసుకురావాల్సిందేనని కేంద్రంతో సంబంధం లేకుండానే రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాలు భర్తీ చేయొచ్చునని రాజ్యాంగం చెబుతుంది  పది జిల్లాలున్న తెలంగాణను 33 జిల్లాలు చేసినట్లే కొత్త మండలాలను జీవో తీసుకొచ్చినట్టే 10 శాతం పై జీవో తీసుకురావాలని ఎల్ హెచ్ పి ఎస్ డిమాండ్ చేస్తుంది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్, ఎల్ హెచ్ పి ఎస్ జిల్లా అర్బన్ అధ్యక్షులు బానోతు కిరణ నాయక్,శ్రీను నాయక్,మహేష్,వీరన్న నాయక్,రామదాసు తదితరులు పాల్గొన్నారు.