కవిత బాటలో అరవింద్‌..?... అరవింద్‌ ప్రవర్తనపై సొంత పార్టీలోనే విమర్శలు... నచ్చని ప్రశ్న వేస్తే జర్నలిస్టులపై ఎదురుదాడి... కవిత మార్గంలోనే అరవింద్‌ అంటు కామెంట్లు... ప్రజలకు అందుబాటులో లేకపోవడమే కారణం... చెప్పిందే రాయాలా... నచ్చంది రాసుకోవాలా...

Submitted by SANJEEVAIAH on Thu, 18/04/2024 - 23:26
Photo

కవిత బాటలో అరవింద్‌..?...

అరవింద్‌ ప్రవర్తనపై సొంత పార్టీలోనే విమర్శలు...

నచ్చని ప్రశ్న వేస్తే జర్నలిస్టులపై ఎదురుదాడి...

కవిత మార్గంలోనే అరవింద్‌ అంటు కామెంట్లు...

ప్రజలకు అందుబాటులో లేకపోవడమే కారణం...

చెప్పిందే రాయాలా... నచ్చంది రాసుకోవాలా...

నోరా నోరా ఓటు కాపాడుకో...

(నిజామాబాద్‌ ఉమ్మడి జిల్లా బ్యూరో - ప్రజాజ్యోతి - ఎడ్ల సంజీవ్‌)

అయనోక యువ నాయకుడు. రాజకీయాల్లో అడుగు పెట్టడమే హంగామా సృష్టించారు. మీడియా, పత్రికలలో పెద్ద పెద్ద ప్రకటనలతో ఈ దేశానికి స్వాతంత్య్రం వచ్చిన రోజున తన రాజకీయ భవిష్యత్తును పరోక్షంగా చెప్పుకున్నారు. అందుకు మీడియా వ్యవస్థనే వేదికగా చేసుకున్న సంగతి జగమెరిగిన సత్యం.  తండ్రి వారసత్వం కాక, అయన పార్టీ కాకుండా కొత్త పార్టీ నుంచి స్వయనా సొంత నిర్ణయంతో అడుగులు వేసారు. అదే నమ్మకంతో యువత, కాషాయానికి అనుకూలంగా ఉన్న ప్రతి ఒక్కరు భావించారు. అప్పటికే యువనేత రాజకీయాల్లోకి వస్తే ఉపాధి అవకాశాలు, వృత్తిపరమైన అవకాశాలు పెరగడమే కాకుండా డిల్లీలో గల్లీ లోల్లి వినిపించి సమస్యలు పరిష్కారిస్తారని ఆశించారు. మరోపక్క పసుపుబోర్డు, షుగర్‌ ఫ్యాక్టరీ సమస్యలు పరిష్కారం అయితే రైతులకు గిట్టుబాటు, రైతు కూలీలకు పని, బోర్డు వస్తే నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయని భావించి అయనపైనే ఆశలు పెంచుకున్నారు. అనుకున్నదే తడావుగా బరిలో నిలిచిన అ యువకుడు, అప్పటి బిఅర్‌ఎస్‌ ఎంపి అభ్యర్థి, సిట్టింగ్‌ ఎంపి, స్వయనా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు కూతురు కవితను ఒడిరచి అయనకు పట్టం కట్టారు. ఇంతకు అయనేవరో అర్ధం అయి ఉంటుంది కదా. అయనే ధర్మపురి అరవింద్‌. ప్రస్తుతం నిజామాబాద్‌ సిట్టింగ్‌ ఎంపి. ఇప్పుడు అదే బిజెపి టికెట్‌పై మరోసారి నిజామాబాద్‌ పార్లమెంట్‌ నుంచి పోటీ చేస్తున్నారు. ప్రచారంలో అభ్యర్థులకు దీటుగా దూసుకుపోతున్నారు. అయన గురించే ఈ ప్రస్తావన. ఇంతకు ఏందుకు అనుకుంటున్నారా... అయితే ఈ స్టోరీ చదవాల్సిందే మరి. 

కవిత బాటలో అరవింద్‌...

స్వారీ కవిత బాటలో అరవింద్‌ అంటే కేసుల గురించి కాదండీ. ఎన్నికల్లో పోటీ, రాజకీయ వ్యవహారాల్లో పోలిక. వ్యవహార శైలీలో తీరు. అన్నింటికి మించి ఇద్దరు ఉద్దండ నేతల వారసులు. ఒక్కరు సిఎం అవ్వలని ప్రయత్నం చేసి విఫలం అయిన  ధర్మపురి శ్రీనివాస్‌ తనయుడు ధర్మపురి అరవింద్‌ కాగా, మరోకరు సిఎం అయిన కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు తనయ కల్వకుంట్ల కవిత. వీరే ఇప్పుడు జరుగుతున్న పార్లమెంట్‌ ఎన్నికలలో హాట్‌ టాపిక్‌గా మారారు. అన్ని రాజకీయ పార్టీలతో పాటు సాదారణ ఓటర్లు, రైతులలో కూడా ఒకే ఒక టాక్‌. వాట్‌ ఈజ్‌ అరవింద్‌. అయిదేళ్ల కాలంలో జిల్లాకు లేదా పార్లమెంట్‌ నియోజక వర్గానికి ఏం చేసారనే ప్రశ్న చర్చోపచర్చలుగా సాగుతుంది. ముఖ్యంగా నిజామాబాద్‌ ఎంపిగా పని చేసిన కవిత అయిదేళ్ల పాటు సాదారణ కార్యకర్తలకు, ప్రజలకు అందుబాటులో లేకపోవడం. నేతలు, నాయకులు ఏం పని కోసం వచ్చిన గంటల తరబడి నీరిక్షణ. తన వద్ద పని చేసే పిఎలు లేదా వివిధ విభాగాలకు బాధ్యులుగా వ్యవహారించిన వారికి అ పనులు అప్పగించడంతో పనులలో తీవ్ర జాప్యం జరిగింది. అన్నింటికి మించి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర కీలక పదవుల్లో ఉన్న నేతలు స్వయనా సిఎం కూతురు కావడంతో కలువడానికి వస్తే గంట నుంచి సుమారు రెండున్నర గంటల పాటు వేచి చూడాల్సిన పరిస్థితి. ఇక ప్రజా సంఘాలు, ఉద్యోగ సంఘాలు, విద్యార్థి సంఘాలు చివరకు రైతులు, కార్మికులు వచ్చిన పడిగాల్పులు తప్పలేదు. దీనికి తోడు అయా విభాగాలకు బాధ్యులుగా ఉన్న వారు అసలు సమస్యను అమె చివికి చేరకుండా చేసారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. అయినప్పటికి అసలు విషయాలు తెలుసుకొని పరిష్కారించాల్సింది పోయి వాటిని పట్టించుకోలేదనే ఆరోపణలు ఉన్నాయి. ఇలాంటి వ్యవహార శైలి, విధానాలు ఎన్నికల్లో అమెకు శాపంగా మారాయి అనేది ఇప్పుడు జరుగుతున్న చర్చ. ఇలా సొంత పార్టీలోనే పూర్తి వ్యతిరేకత మొదలు అయింది. ఇదే దారిలో ఎంపి అరవింద్‌ సైతం వ్యవహారించారనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. సొంత పార్టీలోనే అంతర్గత వ్యతిరేకత బయటకు కనిపించకపోయిన లోలోలన రగులుతున్నారనే వాదనలు ఉన్నాయి. కార్యకర్తల సంగతి ఏలా ఉన్న పార్టీలోని కీలక నేతలను మాట్లాడిరచే పరిస్థితులు లేవనే విమర్శలు ఉన్నాయి. డిల్లీ పెద్దలతో ఉన్న సఖ్యత కారణంగా జిల్లాలో ఉన్న నేతలు సైతం ఎంపి మాటనే వేదం అనేలా వ్యవహారిస్తున్నారు. కానీ బయటకు రాగానే తలలు పట్టుకొని ఇదేం ఖర్మరా బాబు అంటు బహిరంగంగానే వ్యాఖ్యనించడం విశేషం. ఏకంగా నిజామాబాద్ నగర కార్పొరేటర్ ఢిల్లీలో ఎంపిపై ఫిర్యాదు చేసి తన గోడు వెళ్ళబోసుకున్న సంగతి తెలిసిందే.  ఇప్పటికే ఆర్మూర్‌ ఎమ్మెల్యే రాకేష్‌రెడ్డి తీరు విమర్శల పాలు చేయగా, బాల్కోండ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఒటమి పాలైన అన్నపూర్ణ, ఆమె తనయుడు మల్లీఖార్జున్‌ రెడ్డి అంటిముట్టనట్లుగా వ్యవహారిస్తున్నారు. రూరల్‌ నుంచి పోటీ చేసిన దీనేష్‌ బిజెపి జిల్లా సారధి కావడంతో అన్నితానైనట్లు  నడుస్తున్నారు. పార్టీ నేతలు, కార్యకర్తలకు కనీస మర్యాద లేదని, చెప్పింది వినడం తప్పా, తమ మాటకు విలువ లేదనే బహటంగానే వ్యాఖ్యనిస్తున్నారు. గతంలో కవితపై ఇదే తరహాలో విమర్శలు రావడం చివరకు ఒటమి పాలవడమే ఇప్పుడు ఎన్నికలపై చర్చ జరుగుతుంది.  

చెప్పిందే రాయాలా...?

రాజకీయాలలో అడుగు పెట్టాలని నిర్ణయించుకున్న అరవింద్‌ మీడియా, పత్రికలలో ప్రకటనలు ఇచ్చి, వారి రాతల ద్వారానే ప్రజల్లోకి వచ్చారు. అప్పటికే మీడియా ప్రపంచంలో పేరున్న ధర్మపురి శ్రీనివాస్‌ తనయుడు కావడంతో జర్నలిస్టులు సైతం ప్రతినిత్యం అక్షర రూపం ఇచ్చారు. ఇలా రాజకీయాల్లో వచ్చి జనం మద్య నిలిచిన అరవింద్‌ ఇప్పుడు మీడియా అంటే చెప్పింది మాత్రమే రాయాలి. మిగతదంతా నా ఇష్టం అన్నట్లు వ్యవహారించడం గమనర్హం. దానికి తోడు భాష, శైలి సైతం ఇబ్బందులకు గురి చేసేలా ఉండటం విశేషం. ఇటీవల అంజనేయ స్వామి మాలలో ఉన్న జర్నలిస్టు పట్ల సైతం అలాగే వ్యవహారించడం వివాదస్పదం అయింది. గతంలో ఓ జర్నలిస్టుకు తుపాకి చూపి భయపెద్దటం లాంటి సంఘటన తెలిసిందే. మరోపక్క నాగారంలో ఈ వ్యవహారంలో ఇష్టారాజ్యంగా రాస్తే, ఏం చేసిన జర్నలిస్టులపై దాడి చేయండని చెప్పడం లాంటి సంఘటనలు బాగానే ఉన్నాయి. ఇకపోతే ఇటీవల బిజెపి పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో సైతం ఎమ్మెల్సీ కవిత గురించి ప్రశ్నిస్తే తనదైన శైలిలో వ్యాఖ్యనించారు. ‘‘నీ ఇష్టం ఉంటే రాసుకో, లేకుంటే లేదు. లేదంటే వ్యతిరేకంగా రాసుకో’’ అంటు చెప్పడంతో విలేకరులు అంతా నివ్వేరపోయారు. కవిత సైతం జర్నలిస్టుల విషయంలో వారి ఇళ్ల స్థలాల విషయంలోనూ ఇలాగే వ్యవహారించారు. ఇటీవల జర్నలిస్టుల ఇళ్ల స్థలాల విషయమై జిల్లా అధికారిని సంప్రదించగా వెకిలి నవ్వులు నవ్వారు. అంటే జర్నలిస్టులు అంటే ఏంత చిన్నచూపా లేక మరికేమైనా ఉందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. 

ఓటరు మహాశయా..? 

ఏ నాయకుడైనా ఏంతటి నాయకుడైనా జనం నుంచి తిరుగుబాటు వచ్చిన వ్యతిరేకత వచ్చిన ఒటమి తప్పదు. ఎన్నికల్లో ఉన్న ప్రవర్తన గెలిచిన తర్వాత లేకపోవడంతో ఓట్లు వేసిన వారు, ఎన్నికల్లో పని చేసిన వారు, చివరకు పార్టీ నాయకులు సైతం నివ్వెరపోతున్నారు. దీంతో అయిదేళ్ల పాటు మౌనం వహించి ఎన్నికల సమయంలో తమ అక్కసును ఓటింగ్‌ రూపంలో వ్యక్తం చేస్తున్నారు. గత ఎన్నికల్లో స్వయనా ముఖ్యమంత్రి కూతురు అయిన కల్వకుంట్ల కవితను ఒటిమి పాలు చేసిన సంగతి తెలిసిందే. మరి ఈ ఎన్నికల్లో ఓటర్లు ఏం తీర్పు చెప్పుతారో వేచి చూద్దాం మరి.