జూన్ 2 నుంచి తెలంగాణ ప్రజా ఆకాంక్షల దివాస్ జరపాలి... వి ప్రభాకర్, ప్రజాపంథా రాష్ట్ర నాయకుల పిలుపు 

Submitted by SANJEEVAIAH on Wed, 31/05/2023 - 08:17
ఫోటో

జూన్ 2 నుంచి తెలంగాణ ప్రజా ఆకాంక్షల దివాస్ జరపాలి

వి ప్రభాకర్, ప్రజాపంథా రాష్ట్ర నాయకుల పిలుపు 

నిజామాబాద్, ప్రజాజ్యోతి, మే 31 :

తెలంగాణ ఆవిర్భావం సందర్భంగా *తెలంగాణ ఆకాంక్షల దీక్ష దివాస్ గా జరపాలని సిపిఎంఎల్ ప్రజాపంథా పార్టీ ఆధ్వర్యంలో కుమార్ నారాయణ భవన్ లో విలేకరుల సమావేశం  నిర్వహించారు. సిపిఐ ఎంఎల్ ప్రజాపంథా ఏడవ రాష్ట్ర మహాసభల సందర్భంగా దీక్ష దివాస్ రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించాలని పిలుపునిచ్చింది. ఈ సందర్భంగా ప్రజాపంథా రాష్ట్ర నాయకులు వి. ప్రభాకర్ బి.దేవారంలు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వం దశాబ్ది ఉత్సవం పేరుతో పెద్ద ఎత్తున సంబరం జరుపుతుంది. (తెలంగాణ సాధన ఉద్యమ ఆకాంక్షను నెరవేర్చకుండా) కానీ తెలంగాణ ఆశ,, ఆకాంక్ష ఎంత మేరకు నెరవేరిందని వారు అన్నారు. ప్రజాస్వామిక ఆకాంక్షాలతో నిలువెత్తు ఉద్యమం నిర్మించి వందలాది మంది విద్యార్థులు బలిదానాలు చేస్తే నేడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థి బలిదానాలపైన నేడు రాజకీయాలు చేస్తూ ఇచ్చిన హామీలను పక్కనపెట్టి దశాబ్ది ఉత్సవాల పేరుతో ప్రజలను మేధావులను విద్యార్థులను మరోసారి మోసం చేయడానికి ప్రయత్నం చేస్తుందని వారు అన్నారు. కోటి ఆశలతో విద్యార్థులు యువకులు, ఉద్యోగులు సకల జనులు తెలంగాణ కోసం నాడు ఉద్యమం చేయడం జరిగిందని గుర్తు చేశారు. మా ఉద్యోగాలు మా నీళ్లు మాకు వస్తాయని నాడు సంకెళ్లను తెంచుకొని ఉద్యమం వైపు సాగారని వారు అన్నారు. తెలంగాణ వస్తే తెలంగాణలో కాంట్రాక్టు అనే పదమే ఉండదని  పోడు చేసుకుంటున్నా గిరిజనులకు ,,, గిరిజన ఇతరులుపోడు భూముల పట్టాలు ఇస్తామని, ఇల్లు లేని వారికి డబుల్ బెడ్ రూమ్ లు నిర్మిస్తామని ప్రతి ఎస్సీ ఎస్టీ గిరిజనులకు భూమిలేని వారికి మూడు ఎకరాల భూమిని ఇస్తామని సకాలంలో రైతులకు రుణాలను మాఫీ చేస్తామని,,, వలసలను అరికడతానని,, ఎన్నో హామీలు ఇచ్చి గద్దెనెక్కిన కెసిఆర్ ప్రభుత్వం నేడు దానికి విరుద్ధంగా భిన్నంగా,,,, అమరవీరుల త్యాగాలను అవహేళన చేస్తూ,,, పరిపాలన కొనసాగిస్తుందని వారు అన్నారు. తెలంగాణలో ఉద్యమానికి నాయకత్వం వహించిన పార్టీ అధికారంలోకి వచ్చింది కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యారు. ఇచ్చిన హామీలు అమలు చేయకుండా కుటుంబపరిపాలన  ఏకపక్షంగా సాగుతుందని వారు అన్నారు. ఈ తరుణంలోనే సిపిఎం ప్రజాపంథా పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా *తెలంగాణ ఆకాంక్షల దీక్ష దివాస్* ను *జూన్ 2 నుండి 12వ తేదీ* వరకు జరపాలని వారు పిలుపునిచ్చారు.
 ఈ క్రమంలోనే కొన్ని న్యాయమైన డిమాండ్స్ని ప్రభుత్వం ముందు పెట్టడం జరిగింది అని అన్నారు..
★ కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఉద్యోగులను చేయాలి.
★ ఉద్యోగ ఖాళీలన్నీ భర్తీ చేయాలి.
 ★ రైతు రుణాలను మొత్తం ఏకకాలంలో మాఫీ చేయాలి.
★ పోడు భూములన్నింటికీ పట్టాలు ఇవ్వాలి, గిరిజనేతర పేదలకు సాగు హక్కు కల్పించాలి. ★ రేషన్ కార్డులు పెన్షన్లు ఇండ్ల స్థలాలు అర్హులందరికీ ఇవ్వాలి.    ★ ధరణి వెబ్సైట్ అవకతవకాలను వెంటనే సరి చేయాలి.
★ ఉపా చట్టం రద్దు చేయాలి. ★ దళితులకు మూడు ఎకరాల భూమి ఇవ్వాలి.
★ నిరుద్యోగులు అందరికీ పదివేల రూపాయలు నిరుద్యోగ భృతి ఇవ్వాలి.
★ ప్రాజెక్టులకు పంట కాలువలు తీయాలి.
ఈ కార్యక్రమంలో సిపిఎంఎల్ ప్రజాపంథా ఆర్మూర్ సబ్ డివిజన్ కార్యదర్శి బి కిషన్ నాయకులు నజీర్ శ్రీనివాస్ బోట్ల రాజు విజయ్ తదితరులు పాల్గొన్నారు