ఇరిగేషన్ డి ఈ ఈ వెంకటరమణరావు ఆత్మహత్య... ఆత్మహత్యపై అనుమానాలు ఎన్నో.?

Submitted by SANJEEVAIAH on Fri, 06/01/2023 - 10:01
Photo

డీ ఈ ఈ వెంకటరమణ రావు ఆత్మహత్య

ఆత్మహత్యపై అనుమానాలు ఎన్నో.?

నిజామాబాద్, ప్రజాజ్యోతి ప్రతినిధి, జనవరి 6 :

నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ ఇరిగేషన్ శాఖలో పని చేస్తున్న వెంకటరమణారావు గురువారం బాసర సమీపంలోని గోదావరి నదిలో ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఆత్మహత్యపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆయన కుటుంబ సభ్యుల సమాచారం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. వెంకటరమణారావు ఆర్మూర్లో ఇరిగేషన్ శాఖలో విధులు నిర్వహిస్తున్నప్పటికీ హైదరాబాదులో నివాసం ఉంటున్నారు. పిల్లల చదువుల నిమిత్తమై కుటుంబం హైదరాబాదులో ఉంటుంది.  మంగళవారం స్వగ్రామమైన నవపేట్ మండలం పోతంగల్ కు వచ్చారు. బుధవారం ఉదయం డ్యూటీ కి వెళ్తున్నట్టు చెప్పి ఇంటి నుంచి బయలుదేరిన ఆయన మిస్ అయ్యారు. దీనిపై ఆయన సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాసర సమీపంలోని గోదావరి నది ఒడ్డున మోటార్ సైకిల్ లభించడంలో చుట్టుపక్కల గాలించగా ఆయన మృతదేహం లభించింది పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇది ఇలా ఉండగా ఎలాంటి సమస్యలు లేని వెంకటరమణారావు ఆత్మహత్యకు పాల్పడే అవకాశం లేదని కుటుంబ సభ్యులు చెప్తున్నారు.