బీసీల నుంచి ఒక్క సీఎం కాకపోవడం దురదృష్టకరం

Submitted by Ramesh Peddarapu on Mon, 03/10/2022 - 15:02
 It is unfortunate that there is not a single CM from BC

 పాలక వీడు,అక్టోబర్2(ప్రజా జ్యోతి):     స్వాతంత్రం వచ్చింది మొదలుకొని నేటి వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ ప్రత్యేక తెలంగాణలో కానీ ఒక్క బిసి  వ్యక్తి కూడా సీఎం కాకపోవడం దురదృష్టకరమని బీసీ హక్కుల సాధన సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడు ధూళిపాళ ధనుంజయ నాయుడు వ్యాఖ్యానించారు.
 ఆదివారం ఆయన పాలక వీడు మండల కేంద్రంలో విడుదల చేసిన పత్రిక ప్రకటనలో 75 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో బీసీలను ఓట్లు వేసే యంత్రాలుగా చూస్తున్నారే గాని ఏ ఒక్క రాజకీయ పార్టీ కూడా బీసీని ముఖ్యమంత్రిని చేసేందుకు ముందుకు రాలేదని ఇది బీసీల పట్ల జరుగుతున్న వివక్షతకు ప్రత్యక్ష నిదర్శనమని, బీసీలు తమ తమ పార్టీలో తమ స్థాయి ఏమిటో తెలుసుకోవాలని వారిని కార్యకర్తలుగా మండల స్థాయి జిల్లా స్థాయి నాయకత్వానికి పరిమితం చేస్తూ రాష్ట్రస్థాయి వచ్చేసరికి బీసీలను పక్కకు పెడుతున్నారని ఇది అత్యంత దురదృష్టకరమని బీసీల మధ్య అనైక్యత వల్ల ఇది సాధ్యమవుతుందని 506% గా ఉన్న బీసీలు ఒక్క మాట మీద ఉంటే కేవలం ఎనిమిది శాతం ఉన్న అగ్రవర్ణాల పెత్తనాలు రాజకీయ పార్టీల్లో కొనసాగుతాయాఅని ఆయన ప్రశ్నించారు.

 అన్ని రాజకీయ పార్టీలు ఉన్న బీసీలు ఐక్యమై బీసీ నాయకత్వంను సాధించాలని  ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదని ఆయన ఉద్ఘాటించారు స్థానిక సంస్థల్లో 33 శాతం గా ఉన్న బీసీ రిజర్వేషన్ ను తెలంగాణ ప్రభుత్వం వచ్చాక 25 శాతానికి కుదించిందని తక్షణమే బీసీల రిజర్వేషన్లు 50% పెంచాలని 6% గా ఉన్న గిరిజనులను 10 శాతానికి పెంచడం హర్షణీయమని అలాగే 25 శాతం గా ఉన్న బీసీల శాతాన్ని 50 శాతానికి పెంచాలని ఆయన డిమాండ్ చేశారు.ఆయన వెంట బీసీ నాయకులు పేరూరి నాగయ్య, బుర్రి చంద్రయ్య, తులాల రాము తదితరులు ఉన్నారు.