జాతీయ సమైక్యతే తెలంగాణ ధ్యేయం -ఎమ్మెల్యే నోముల భగత్

Submitted by kareem Md on Fri, 16/09/2022 - 16:55
Telangana's mission is national unity - MLA Nomula Bhagat

-త్రివర్ణ పతాకాలు చేతబట్టి విద్యార్థుల ర్యాలీ
ఫోటో రైటప్: హాలియా పురవీధులలో విద్యార్థులచే ర్యాలీ.

హలియా,సెప్టెంబర్16(ప్రజా జ్యోతి):  జాతీయ సమైక్యతే  ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం ముందుకెళ్తుందని ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్ అన్నారు.  వజ్రోత్సవాలను పురస్కరించుకొని శుక్రవారం హాలియా పురవీధులలో విద్యార్థులతో భారీ ర్యాలీ నిర్వహించారు.ర్యాలీలో మహిళలతో బతుకమ్మలు కోలాటాలు,నృత్యాలు చేస్తూ సందడి చేశారు.తెలంగాణ సంస్కృతిని జాతీయ సమైక్యతను చాటుతూ స్థానిక లక్ష్మీనరసింహ గార్డెన్స్ నుంచి మినీ స్టేడియం వరకు భారీ ర్యాలి చేపట్టారు.అనంతరం స్థానిక శాసనసభ్యులు మినీ స్టేడియంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ స్వాతంత్ర్య సమరయోధుల స్ఫూర్తితోనే తెలంగాణలో సీఎం కేసీఆర్ పరిపాలన సాగుతుందన్నారు. సామాజిక పోరాట రథసారథి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వలన తెలంగాణ రాష్ట్రం సహకారం అయిందన్నారు. రాష్ట్రంలో నూతన సచివాలయానికి రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ పేరు సీఎం కేసీఆర్ పెట్టడం మనందరికీ గర్వకారణం అన్నారు. ప్రపంచ మేధావులలో రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ఒకరిని కొనియాడారు.సీఎం కేసీఆర్ పరిపాలనలో రాష్ట్రం అభివృద్ధి దిశలో పయనిస్తుందన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో ప్రవేశపెట్టని సంక్షేమ పథకాలు  తెలంగాణ రాష్ట్రంలోనే ప్రవేశపెట్టిన ఘనత సీఎం కేసీఆర్ కే దక్కుతుందన్నారు.  ఈ కార్యక్రమంలో ట్రైకార్ చైర్మన్ ఇస్లావత్ రామచందర్ నాయక్, జాయింట్ కలెక్టర్ భాస్కర్ రావు,జడ్పీ వైస్ చైర్మన్ ఇరిగి పెద్దులు,పిడి రాజకుమార్  మున్సిపల్ చైర్మన్ వెంపటి పార్వతమ్మ శంకరయ్య, జడ్పీటీసీలు,ఎంపీపీలు మున్సిపల్ కౌన్సిలర్లు, మార్కెట్ చైర్మన్లు,సర్పంచులు ఎంపీటీసీలు, కార్యవర్గ సభ్యులు,కళాకారులు,ప్రజలు తదితరులు పాల్గొన్నారు.