పేదోడి అండ ఎర్రజెండా

Submitted by krishna swamy on Sat, 17/09/2022 - 11:07
Red flag under poverty
  • అమరవీరులకు నిజమైన వారసులు కమ్యూనిస్టులే - ఎం డి జాంగిర్ సిపిఎం జిల్లా కార్యదర్శి 
  • ఘనంగా వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలు 
  • వ్యాసరచన పోటీలలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతుల ప్రధానం

భూదాన్ పోచంపల్లి, సెప్టెంబర్ 16 (ప్రజా జ్యోతి) తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో అమరులైన వీరులకు నిజమైన వారసులు కమ్యూనిస్టులేనని యాదాద్రి భువనగిరి జిల్లా సిపిఎం జిల్లా కార్యదర్శి ఎండి జహంగీర్ అన్నారు. వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాల సందర్భంగా శుక్రవారం పోచంపల్లి పట్టణ కేంద్రంలో పార్టీ కార్యాలయం నుండి బైక్ ర్యాలీగా బయలుదేరి వీరనారి చాకలి ఐలమ్మకి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.  అనంతరం భువనగిరి చౌరస్తా వద్ద ఏర్పాటు చేసిన వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాల బహిరంగ సభ సిపిఎం పార్టీ మండల కార్యదర్శి పగిళ్ల లింగారెడ్డి అధ్యక్షతన సభ నిర్వహించగా ఈ సభకు ముఖ్యఅతిథిగా జిల్లా కార్యదర్శి జాంగిర్ హాజరయ్యారు. అనంతరం వారు మాట్లాడుతూ నాడు నుంచి రాయి నుంచి వరుసలా వడసల నుంచి గుతుపల సంఘాలు గుతుపల సంఘాల నుంచి తుపాకుల వరకు సాయుధ పోరాటం సాగిందని అప్పట్లో నిజం జాగీదారి భూస్వాముల పేర్ల మీదనే భూములు ఉండేవని వారికి వ్యతిరేకంగా భూమి కోసం భుక్తి కోసం వ్యక్తి చాకిరి విముక్తి కోసం చాకలి ఐలమ్మ పోరాటం మొదలుపెట్టారని నాలుగు ఎకరాల భూమి కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తున్న ఐలమ్మను చూసి ఓర్వలేక విసునూరు రామచంద్రారెడ్డి దేశముకు ఆమెను అనేక ఇబ్బందులు పెట్టినా భయపడకపోవడంతో కోర్టులో కేసులు వేసి ఇబ్బంది పెట్టారన్నారు. అయిలమ్మ పండించిన పంటను దోచుకెళ్లేందుకు రామ్ చంద్రారెడ్డి ప్రయత్నం చేస్తే ఆమెకు అండగా ఎర్రజెండా పార్టీ నిలబడి పోరాటం చేసిందని అలా నిజాం రజాకారులను భూస్వాములకు పెత్తందారులకు వ్యతిరేకంగా సాగిన పోరాటంలో కమ్యూనిస్టులు ప్రజలకు అండగా నిలిచి పెత్తందారుల 10 లక్షల ఎకరాల భూముల్లో ఎర్రజెండా పార్టీ పేదలకు పంచిపెట్టిందన్నారు. ఎర్ర జెండా పట్టుకొని కడవెండిలో ఉద్యమాలు చేస్తున్న దొడ్డి కొమరయ్యను నిజం రజాకారులు కాల్చి చంపారని తెలంగాణ సాయుధ పోరాటంలో తొలి అమరుడు దొడ్డి కొమురయ్య అని అన్నారు. తెలంగాణ సాయుధ పోరాటంలో ఎలాంటి సంబంధం లేని మతోన్మాద బీజేపీ ప్రభుత్వం చరిత్రను వక్రీకరిస్తుందని విమర్శించారు. తెలంగాణ సాయుధ పోరాటాన్ని హిందూ ముస్లిం పోరాటంగా చిత్రీకరించేందుకు బిజెపి కుట్ర పన్నుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.

అదేవిధంగా సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నరసింహ మాట్లాడుతూ తెలంగాణలో దున్నుకునే వారికి భూమి పచాలని పెట్టి చాకిరి నుంచి విముక్తి కావాలని నిజం రాచరిక వ్యవస్థను కూల్చేందుకు రైతంగ సాయుధ పోరాటం కమ్యూనిస్టులు నాయకత్వంలో జరిగిందని మూడువేల గ్రామాల భూస్వాముల నిరంకుశల పాలన నుంచి విముక్తి చేసి లక్షల ఎకరాలు పంచింది కమ్యూనిస్టులేనని 4000 మంది కమ్యూనిస్టుల ప్రాణ త్యాగం చేసి తెలంగాణలో నిజాం నిరంకుశ పాలన సమర గీతం పాడారని ఇంతటి మహత్తర పోరాటానికి బిజెపి మతం మకిలి అనిపించే ప్రయత్నం చేస్తుందని విమర్శించారు. సాయుధ పోరాటం మతాల మధ్య జరిగిన ఘర్షణ కాదని దోపిడీదారులైన భూస్వాములు అరాచకాలకు వారికి అండగాలినిచ్చిన నిజాం నవాబుకు వ్యతిరేకంగా దోపిడీకి అణిచివేతకు గురవుతున్న హిందూ ముస్లింలు ఐక్యంగా సాగించిన పోరాటమని వారు అన్నారు. అని విసునూరు దేశ్ముఖ రామచంద్రారెడ్డి జన్నారం ప్రతాపరెడ్డి తదితరుల జమిందార్ల దౌర్జన్యాలను ఎదిరించి భీమ్ రెడ్డి నరసింహారెడ్డి దొడ్డి కొమురయ్య ఐలమ్మ లాంటి ఎందరో మహనీయులు అన్నారు. సభ అనంతరం ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో సాయుధ పోరాట వారోత్సవాల సందర్భంగా నిర్వహించిన వ్యాసరచన పోటీలలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతుల ప్రధానోత్సవం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు గడ్డం వెంకటేశు బండారు నరసింహ, సిపిఎం సీనియర్ నాయకులు గూడూరు అంజిరెడ్డి, సింగల్ విండో డైరెక్టర్ అందేలా జ్యోతి,పట్టణ కార్యదర్శి కోడె బాల నరసింహ, మండల కార్యదర్శి వర్గ సభ్యులు కోట రామచంద్రారెడ్డి, ప్రసాదం విష్ణు ,మంచాల మధు, గూడూరు బుచ్చిరెడ్డి ,మండల కమిటీ సభ్యులు, బిక్షపతి ,కృష్ణారెడ్డి లాలయ్య, జంగయ్య, పట్టణ కమిటీ సభ్యులు రామ్ సాని అనిల్ రెడ్డి, జగన్ మరియు ఎస్ఎఫ్ఐ మండల అధ్యక్షులు సిద్ధగోని పరమేశు ,శాఖ కార్యదర్శిలు రాజు, మల్లారెడ్డి, నాయకులు పురుషోత్తం రెడ్డి ,అంజి నేలు, అందెల అశోకు, సామజంగారెడ్డి ,వీఆర్ఏల సంఘం మండల అధ్యక్షులు ,కొమ్ము ఊశయ్య మరియు ,వీఆర్ఏలు ,శ్రీ సాయి మెటల్ డ్రైవర్స్ అండ్ వర్కర్స్ యూనియన్, సూపర్ ఫైన్ లిమిటెడ్ డ్రైవర్స్ అండ్ వర్కర్స్ యూనియన్ సిఐటియు, నాయకులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.