నూతన పార్లమెంట్ భవనానికి డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ పేరు పెట్టాలి: భట్టి విక్రమార్క

Submitted by Degala Veladri on Tue, 13/09/2022 - 12:28
The new Parliament building is named after Dr. Baba Saheb Ambedkar

నూతన పార్లమెంట్ భవనానికి డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ పేరు

తెలంగాణ అసెంబ్లీ తీర్మాణం చేయాలని భట్టి ప్రతిపాదన

అసెంబ్లీలో తీర్మాణం ప్రవేశపెట్టిన కేసిఆర్ కు భట్టి కృతజ్ఞతలు

బోనకల్, సెప్టెంబర్ 13 , ప్రజాజ్యోతి:

దేశ రాజధాని ఢిల్లీలో నూతనంగా నిర్మిస్తున్న పార్లమెంట్ భవనానికి రాజ్యంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ పేరు పెట్టాలని తెలంగాణ అసెంబ్లీ తీర్మాణం చేయాలని సభలో తన ప్రతిపాదనకు వెంటనే సీఎం కేసీఆర్ స్పందించి ఈరోజు అసెంబ్లీలో తీర్మాణం ప్రవేశపెట్టినందుకు హృదయ పూర్వక కృతజ్ఞతలు చెబుతున్నట్టు తెలంగాణ రాష్ట్ర శాసనసభ పక్ష నేత మల్లు భట్టి విక్రమార్క వెల్లడించారు.ఈ తీర్మానాన్ని శాసన సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించాలని విజ్ఞప్తి చేశారు.డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ రూపొందించిన  రాజ్యంగం ద్వారానే ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుందన్న విషయాన్ని తీర్మాణం ప్రవేశపెట్టిన సందర్భంగా మంత్రి కేటీఆర్ ప్రస్తావించి నందుకు అభినందనలు తెలిపారు. రాజ్యగం ద్వారా అంధించిన స్వేచ్ఛ, సమానత్వం,సౌభ్రాతృత్వం దేశ ప్రజలకు దూరం అవుతున్నాయని అన్నారు. దేశంలో స్వేచ్ఛగా మాట్లాడే పరిస్థితి లేదన్నారు. మాట్లాడిన వారిపై సిబిఐ, ఐటీ, ఈడీ దాడులు జరుగుతున్నాయని పాలకులు దేశ సంపదను కొన్ని వర్గాలకు మాత్రమే పంచుతున్నారని, దీంతో సమానత్వం కూడ లేకుండ పోతుందన్నారు. విద్వేశాలు రెచ్చగొట్టి  సమాజంలో అలజడులు రేపి శాంతిని కలుషితం చేసే ప్రయత్నం చేస్తూ సోధరభావం లేకుండా కొంత మంది చేస్తున్నారని అన్నారు. ఇలాంటి క్రమంలో బాబాసాహెబ్ అంబేద్కర్ పేరును పార్లమెంటుకు పెట్టడం వల్ల ఆయన స్ఫూర్తితో నైనా కొంత మార్పు రావడానికి అవకాశం ఉందన్నారు.

అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి

హైదరాబాద్ పంజాగుట్ట చౌరస్తలో అంబేద్కర్ విగ్రహాన్ని జీహెచ్ఎంసీ అధికారులు తొలగించి పంజాగుట్ట పోలీస్ స్టేషన్ ఆవరణలో ఉన్న సైకిల్ స్టాండ్ లో పెట్టారు. మాజీ రాజ్యసభ సభ్యులు వి.హెచ్ హన్మంతరావు అంబేద్కర్ విగ్రహన్ని పంజాగుట్ట చౌరస్తలో తిరిగి ఏర్పాటు చేయాలని కొంత కాలం నుంచి మాజీ పార్లమెంటు సభ్యులు విహెచ్ హనుమంతరావు  పోరాటం చేస్తున్నారు. పార్లమెంట్ భవనానికి రాజ్యంగ నిర్మాత డాక్టర్ బాబ సాహెబ్ అంబేద్కర్ పేరు పెట్టాలని తెలంగాణ అసెంబ్లీ తీర్మాణం చేసిన సందర్భంగా పంజాగుట్ట చౌరస్తాలో తొలగించిన అంబేద్కర్ విగ్రహాన్ని తిరిగి ఏర్పాటు చేసి గౌరవం కల్పించాలని విజ్ఞప్తి చేశారు.