నైటింగేల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో మన కొత్తగూడెంలో మనో విజ్ఞాన యాత్ర కార్యక్రమం

Submitted by Srikanthgali on Fri, 25/11/2022 - 14:10
Mano Vigyan Yatra program in Mana Kottagudem under the auspices of Nightingale Trust

నైటింగేల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో మన కొత్తగూడెంలో మనో విజ్ఞాన యాత్ర కార్యక్రమం

కొత్తగూడెంక్రైమ్, నవంబర్ 24, ప్రజాజ్యోతి:

మానసిక వికాసమే లక్ష్యంగా నైటింగేల్ ట్రస్ట్ ద్వారా మన కొత్తగూడెంలో మనోవిజ్ఞాన యాత్ర కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించారు. మానసిక,సాంకేతిక,ఆర్థిక సమస్యలను అధిగమించడానికి అదేవిధంగా యువశక్తిని పెంపొందించాలని గొప్ప సంకల్పంతో సూపర్ ఫౌండేషన్ ద్వారా ప్రారంభించబడి ఈ మిషన్ రెండు తెలుగు రాష్ట్రాలలో 30 జిల్లాలో 30 రోజుల పాటు జరుగుతున్న యాత్ర గురువారం కొత్తగూడెంలోని సెయింట్ జోసెఫ్ హై స్కూల్లో విజయవంతంగా జరిగింది. ఈ కార్యక్రమానికి సెయింట్ జోసెఫ్ అదేవిధంగా జడ్.పి.హెచ్.ఎస్ రుద్రంపూర్ రెండు స్కూల్ల విద్యార్థులు పాల్గొనడం జరిగింది అని నైటింగేల్ చారిటబుల్ ట్రస్ట్ వారు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వచ్చిన సూపర్ ఫౌండేషన్ ఫౌండర్ సుధీర్ సండ్రా ( సైకాలజిస్ట్) మాట్లాడుతూ విద్యార్థులలో ప్రవర్తన మానసిక ఉల్లాసానికి విద్యార్థులు ఎదుగుదలకు ఇలాంటి కార్యక్రమాలు ఉపయోగపడతాయని ఆయన అన్నారు. టెక్నాలజీ పెరుగుతున్న క్రమంలో విద్యార్థులు వాటిని వారి జీవన విధాన శైలికి వారి ఎదుగుదలకు ఉపయోగించుకోవాలని ఆయన తెలిపారు. విద్యార్థులు మానసిక వికాసం కెరియర్ గైడెన్స్ వారి జీవితాలను ఉన్నత స్థాయిలోకి వెళ్లడానికి కావలసిన అనేక విషయాలను విద్యార్థులకు అర్థమయ్యే విధంగా చాలా ఉపయోగకరంగా కార్యక్రమం జరిగినది అని ఆయన అన్నారు. కార్యక్రమంలో డిజిటల్ మార్కెటింగ్ నిపుణులు నిఖిల్ గుండా, ఎడిట్ పాయింట్ ఇండియా అధినేత రమేష్ ఇప్పలపల్లి, నైటింగేల్ చారిటబుల్ ట్రస్టి అభినయ కోలపాక, డైరెక్టర్ ఎల్ జె ప్రవీణ్, ప్రాజెక్ట్ మేనేజర్ బి.పవన్, విద్యార్థులు, ఉపాధ్యాయులు సెయింట్ జోసెఫ్ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఫాదర్ రాజశేఖర్ రెడ్డి, జడ్పీహెచ్ఎస్ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు లక్ష్మీ పాల్గొన్నారు. నైటింగేల్ చారిటబుల్ ట్రస్ట్ వారి కృతజ్ఞతలు తెలియజేశారు.