లిఫ్ట్ ఎత్తిపోతల పనులను ఆపాలని స్థానిక రైతులు ఆందోళన

Submitted by Ramesh Peddarapu on Fri, 23/09/2022 - 10:20
Local farmers are concerned to stop the lifting works

పాలక వీడు,సెప్టెంబర్22(ప్రజా జ్యోతి):  పాలకీడు మండలం గుండే బోయిన గూడెం గ్రామ శివారులో తెలంగాణ ప్రభుత్వం పులిచింతల బ్యాక్ వాటర్ కృష్ణా నది సమీపాన నిర్మిస్తున్న ఎత్తిపోతల పనులకు స్థానిక రైతు, మండల టిఆర్ఎస్ నాయకుడు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ లిఫ్ట్ నిర్మాణంలో తమ సొంత  భూములు పోగొట్టుకోవడానికి సిద్ధపడ్డామని, ప్రభుత్వం నుండి తాము కోల్పోతున్న భూమికి నష్టపరిహారం, ఏ సర్వే నెంబర్ లో  ఎంత భూమి పోతుందన్న వివరాలు పూర్తికాకముందే  పనులు చేపట్టడం ఏంటని నిర్మాణదారులను ప్రశ్నించారు. తక్షణమే పనులను ఆపాలని కోరారు. లిఫ్ట్ నిర్మాణం లో భాగంగా మొత్తం 14 కిలోమీటర్ల పైప్ లైన్, జానపాడు రహదారి వరకు పైపులైను వెంట  రోడ్డు నిర్మాణం పై పరిసర గ్రామాల రైతుల్లో ఆందోళన ఉందని దాన్ని నివృత్తి చేయాల్సిన బాధ్యత, ప్రభుత్వ అధికారులు, గుత్తేదారులపై  ఉందన్నారు. స్థల పరిశీలనకు వచ్చిన  మండల తహసిల్దార్ శ్రీదేవి, ఆర్ ఐ జానీ పాషా, సర్వేర్,  రెవెన్యూ సిబ్బంది ,లిఫ్ట్ నిర్మాణానికి అవసరమై 65వ సర్వే నెంబర్ అని భావిస్తూ సుమారు 5 ఎకరాలకు  డిజిటల్ సర్వే ప్రకారం నిర్మాణదారులు చూపెట్టిన హద్దులను, పెగ్ సిస్టం ద్వారా  సర్వే చేశారు. ఈ రిపోర్ట్ ను ప్రభుత్వానికి పంపిస్తామని ఎంఆర్ఓ స్పష్టం చేశారు. ప్రభుత్వం సుమారు 185 కోట్ల రూపాయలతో చేపడుతున్న ఈ లిఫ్ట్ ద్వారా  మండలంలోని నాగార్జునసాగర్  ఎడమ కాలువ పదో నెంబర్ చివరి ఆయకట్టు భూములు 6000 ఎకరాలకు పైగా నీటి సమస్య తీరుతుందని నీటిపారుదల శాఖ ఏఈఈ కురుమయ్య తెలిపారు. వివిధ గ్రామాలకు చెందిన దేవి రెడ్డి వెంకట్ రెడ్డి, భోగాల వెంకటరెడ్డి, తాటికొండ  వెంకట్ రెడ్డి,  రైతులు  ప్రశాంత్, వెంకట్ తదితరులు పాల్గొన్నారు.